ఆంధ్రాబ్యాంక్ ఫలితాలు నిరాశ
హైదరాబాద్: 2012 జూన్ 30తో ముగిసిన త్రైమాసికానికి ఆంధ్రాబ్యాంకు లక్షా 94 వేల 307 కోట్ల వ్యాపారం చేసింది. ఈ ఆర్ధిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో ఆంధ్రాబ్యాంకు ఫలితాలు నిరాశపరిచాయి. గతేడాది ఇదే సమయంతో పోలిస్తే బ్యాంకు నికరలాభం 6.2 శాతం మేర పడిపోయింది. అంతర్జాతీయంఆ ఆర్ధిక మాంద్యం ప్రభావం వల్ల కార్పొరేట్ రంగం కుదేలయ్యిందని తద్వారా రుణాల చెల్లింపుల్లో స్తబ్దత నెలకొనడంతో నికరంగా లభాలు తగ్గాయని బ్యాంకు చైర్మన్ బి.ఎ. ప్రభాకర్ తెలిపారు.