*ఆకస్మాత్తుగా అంగన్వాడీ సెంటర్ల తనిఖీ చేసిన సర్పంచ్ పద్మారాజేశ్వర్*

కమ్మర్పల్లి29సెప్టెంబర్(జనంసాక్షి) కమ్మర్పల్లి మండలంలోని హాసకొత్తూర్ గ్రామములో బుధవారం రోజున గ్రామ పంచాయతీ సాధారణ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నూతన గృహ నిర్మాణాల పర్మిషన్, పారిశుద్ధ్యం,మంచినీటి సరఫరా,వీధి దీపాలు గురించి పలు అంశాల పైన గ్రామ పాలకవర్గం చర్చించడం జరిగిందని గ్రామ సర్పంచ్ ఏనుగు పద్మరాజేశ్వర్ తెలిపారు. ఈ సమావేశానంతరం గ్రామంలోని అంగన్వాడీ సెంటర్లను అకస్మాత్తుగా తనిఖీ చేశారు. గర్భిణులకు బాలింతలకు చిన్న పిల్లలకు అందజేస్తున్నటువంటి పౌష్టిక ఆహారము పాలు,గుడ్లు, పప్పు, బియ్యాన్ని సరుకుల రిజిస్టర్ ను పరిశీలించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ కార్యదర్శి ఎం రజనీకాంత్ రెడ్డి, వాట్స్ సభ్యులు కుందేటి పుష్ప, కుందారం శ్రావణ్, మెట్టుపల్లి లావణ్య, మండేపల్లి మాధురి, వేంపల్లి, సట్టా సరిత, శాంత,నవీన్,కవిత,గంగాధర్,కరొబార్ రమణ తదితరులు పాల్గొన్నారు.