ఆకస్మికంగా పర్యటిస్తా
– నాటిన ప్రతిమొక్కకు నీరుపోయండి
– హరితహారం లక్ష్యం కొనసాగాలి
– సీఎం కేసీఆర్
హైదరాబాద్,జులై 22(జనంసాక్షి): హరితహారం లక్ష్యంలో వెనకడుగు వేయరాదని, ఇదే స్ఫూర్తితో ముందుకు సాగాలని సిఎం కెసిఆర్ అధికారులను ఆదేశించారు. అలాగే నాటిన ప్రతి మొక్క బతికేలా చర్యలు తీసుకోవాలన్నారు. హరితహారంపై ముఖ్యమంత్రి కేసీఆర్ సవిూక్ష సమావేశం నిర్వహించారు. హరితహారంపై సోమవారం నుంచి ముఖ్యమంత్రి ఆకస్మిక పర్యటన చేయనున్నారు. హరితహారంలో ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొనే విధానంపైనే పనితీరు అంచనా వేస్తామని సీఎం తెలిపారు. మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు ఆయా జిల్లాల్లో హరితహారంలోనే ఉండాలని అన్నారు. ముందుగా ప్రకటించకుండానే ఆయా జిల్లాలకు వెళ్లి హరితహారంలో పాల్గొంటానని తెలిపారు. 46 కోట్ల మొక్కలు నాటి సంరక్షించేలా ప్రతి ఒక్కరూ ప్రణాళిక రూపొందించాలని చెప్పారు. జిల్లా, నియోజకవర్గం, మండలాల వారి ప్రణాళిక రూపొందించి కార్యాచరణ చేపట్టాలని సూచించారు. అగ్ని మాపక యంత్రాలను ఉపయోగించి మొక్కలకు నీరు పోయాలని అన్నారు. ఫైరింజన్ డ్రైవర్లకు వాకీటాకీలు ఇవ్వాలని ఆదేశించారు. నీళ్లు లేక మొక్కలు ఎండిపోయాయనే పరిస్థితి తలెత్తవద్దు. ప్రజాప్రతినిధులు, అధికారులు చివరి మొక్క నాటే వరకు యుద్ధం చేసే తరహాలో పనిచేయాలని చెప్పారు. ఇదో ఉద్యమంలా సాగుతున్న దశలో దీనిని అంతా విజయవంతం చేసి ఆకుపచ్చ తెలంగాణ చేయాలన్నారు. నీళ్లు లేకుండా మొక్కలు ఎండిపోయాయాన్న సమాధానం రావద్దన్నారు. యుద్దం తరహాలో వీటిని సంరంక్షించాలన్నారు. కాంపానిధులు 1500 కోట్లు అందుబాలు ఉన్నాయని, అవసరమైతే ఇతర నిధులను కూడా వినియోగించుకోవాలన్నారు. ప్రజాప్రతినిధులు, కలెక్టర్లు ఇదే పనిలో ఉండాలన్నారు. వివిధ మార్గాల ద్వారా సేకరించిన సమాచరం మేరకు పనితీరును అంచనా వేస్తానని అన్నారు. సవిూక్షలో మంత్రి హరీష్ రావు, చీఫ్ సెక్రటరీ రాజీవ్ శర్మ, సమాచారశాఖ కమిషనర్నవీన్ మిట్టల్ తదితరులు పాల్గోన్నారు.




