ఆక్రమిత కాశ్మీర్‌ను ఖాళీచేయండి

ఉగ్రవాద చర్యలను ఎగదోయడం మానుకోవాలి
ఉగ్రమూకలకు అండగా ఉండడం దానికి అలవాటే
ట్విన్‌ టవర్స్‌ కూలిచిన లాడెనకు ఆశ్రయమించిన ఘనతవారిది
ఐరాస వేదికగా పాక్‌ చెంప చెళ్లుమనిపించిన భారత్‌
న్యూయార్క్‌,సెప్టెంబర్‌25 (జనంసాక్షి); : ఉగ్రవాదులకు స్వర్గధామంగా మారిన పాకిస్థాన్‌.. ’ఇంటికి నిప్పు పెట్టి తిరిగి అవే మంటల్ని ఆర్పే వ్యక్తిలా నటిస్తోంద’ని భారత్‌ దుయ్యబట్టింది. ఉగ్రవాదులను పెంచిపోషిస్తున్న పాక్‌ దుర్నీతి వల్ల యావత్తు ప్రపంచం ఇబ్బందులు ఎదుర్కొంటోందని పేర్కొంది. ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో కశ్మీర్‌ అంశాన్ని లేవనెత్తిన పాకిస్థాన్‌కు జవాబిస్తూ భారత్‌ ఈ వ్యాఖ్యలు చేసింది.
పాకిస్థాన్‌ ప్రధాని భారత అంతర్గత విషయాలను ప్రస్తావించారు. తద్వారా ఈ వేదిక ప్రతిష్ఠను తగ్గించారు. ఈ క్రమంలో వారికి బదులిచ్చే హక్కును వినియోగించుకుంటున్నాం. ఓ అంతర్జాతీయ వేదికపై అవాస్తవాలతో విషం చిమ్మేందుకు పాక్‌ ప్రయత్నిస్తోంది. అందుకే నిజాల్ని ప్రపంచం ముందుంచాలను కుంటున్నాం.పాకిస్తాన్‌ కాశ్మీర్‌ లో ఆక్రమించిన భాగాలు వెంటనే ఖాళీ చేయాలని అదే ఐక్యరాజ్యసమితి వేదికగా తీవ్రంగా హెచ్చరించింది. ఐక్యరాజ్యసమితిలో భారతీయ దౌత్యవేత్త స్నేహా దూబే మాట్లాడుతూ ఈ హెచ్చరిక చేశారు. పైగా పదే పదే అవాస్తవాలు వ్లలెవేస్తున్న నాయకుడి మానసిక స్థితిపై మనమంతా జాలిచూపాల్సి ఉందని దూబే పేర్కొన్నారు. తమని తాము ఉగ్రవాద బాధిత దేశంగా పాకిస్థాన్‌ చెప్పు కొంటోంది. ఇంటికి నిప్పు పెట్టి తిరిగి అవే మంటల్ని ఆర్పే వ్యక్తిలా పాక్‌ నటిస్తోంది. వారి విధానాల వల్ల యావత్తు ప్రపంచం ఇబ్బందులు ఎదుర్కొంది. పాక్‌ను ఉగ్రవాదానికి మద్దతునిస్తున్న దేశంగా ఈ ప్రపంచం చూస్తోంది. పైగా వారి దేశంలోని వేర్పాటువాద ఉద్యమాల్ని ఉగ్రవాద చర్యలుగా చిత్రీకరిస్తోందని ఐరాసలోని భారత ప్రతినిధి స్నేహా దూబే దీటుగా బదులిచ్చారు. అమెరికాలో ప్రపంచ వాణిజ్య భవంతులపై జరిగిన ఉగ్రదాడిని ఈ సందర్భంగా భారత్‌ ప్రస్తావించింది. 20 ఏళ్ల క్రితం జరిగిన ఆ మారణహోమాన్ని ఇంకా ఎవరూ మర్చిపోలేదని వ్యాఖ్యానించింది. అంతటి ఘోరానికి పాల్పడిన ఉగ్రనేత
ఒసామా బిన్‌ లాడెన్‌కు పాక్‌ ఆశ్రయమిచ్చిందని గుర్తు చేసింది. పైగా ఆ ముష్కరుణ్ని పాక్‌ నేతలు అమరుడిగా కీర్తిస్తున్నాయని పాక్‌ దుర్బుద్ధిని ఎండగట్టింది. ఇంకా పాకిస్థాన్‌ తమ ఉగ్రచర్యల్ని సమర్థించుకుంటోందని స్పష్టం చేసింది. ఈ ఆధునిక యుగంలో ఉగ్రసమర్థ చర్యలు ఏమాత్రం సమంజసం కాదని తేల్చి చెప్పింది. పాక్‌ సహా పొరుగు దేశాలన్నింటితో భారత్‌ సత్సంబంధాలనే కోరుకుంటోందని దూబే ఐరాస వేదికగా స్పష్టం చేశారు. అయితే, పాక్‌ ఆ దిశగా చొరవచూపాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఉగ్రవాద నిర్మూలనకు విశ్వసనీయ, తిరుగులేని చర్యలు తీసుకోవాలని తేల్చి చెప్పారు. సిక్కులు, హిందువులు, కైస్త్రవుల వంటి మైనారిటీలను పాక్‌లో అణచివేస్తున్నారని పేర్కొన్నారు. దీనికి ప్రభుత్వం, నాయకుల మద్దతు సైతం ఉందని తెలిపారు. నిరసన తెలిపే గొంతుల్ని నొక్కేస్తున్నారని పేర్కొన్నారు. అపహరణ, చట్టవిరుద్ధ మరణశిక్షలు పరిపాటిగా మారాయని గుర్తుచేశారు. ఐరాసలో ప్రసంగించిన పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ కశ్మీర్‌ స్వయంప్రతిపత్తి రద్దు అంశాన్ని లేవనెత్తారు. అలాగే ఇటీవల మరణించిన వేర్పాటువాద నేత సయ్యద్‌ అలీ షా గిలానీ పేరును సైతం తన ప్రసంగంలో ప్రస్తావించారు. ఇలా పాక్‌ నేత, ఐరాసలోని ఆ దేశ ప్రతినిధులు కశ్మీర్‌ అంశాన్ని లేవనెత్తడం ఇది కొత్తేవిూ కాదు. అయితే, ప్రపంచ దృష్టిని ఆకర్షించడంలో మాత్రం పాక్‌ విఫలమైంది. ప్రపంచ దేశాలు దీన్ని ఇరు దేశాల మధ్య
ద్వైపాక్షిక అంశంగా పరిగణిస్తున్నాయి కాశ్మీర్‌, ఆఫ్ఘనిస్తాన్‌పై దృష్టి పెట్టిన పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఐక్యరాజ్యసమితి జనరల్‌ అసెంబ్లీలో భారత్‌ పై మాటల దాడి చేశారు. దీనికి భారతదేశం ధీటుగా స్పందించింది. మొత్తం జమ్మూ కాశ్మీర్‌, లడఖ్‌ భారత్‌ అంతర్భాగం అని చెప్పిన భారత్‌.. అందులో ఎవరి జోక్యాన్నీ సహించబోమని తెగేసి చెప్పింది. అంతేకాకుండా అబద్దాల ప్రచారానికి దిగిన ఇమ్రాన్‌ చెంప పగిలేలా హెచ్చరిక చేసింది. పాకిస్తాన్‌ చరిత్రలో ఉగ్రవాదులను ప్రోత్సహించడం..సహాయం చేయడం ఐక్యరాజ్యసమితి సభ్య దేశాలకు తెలుసు. ఇది పాకిస్తాన్‌ విధానంలో చేర్చి ఉందని దుబే అన్నారు. పాకిస్తాన్‌ ఉగ్రవాదులు పాకిస్థాన్‌లో స్వేచ్ఛగా తిరుగుతుండగా, పాకిస్తాన్‌ భారతదేశానికి వ్యతిరేకంగా అబద్దాలు వ్యాప్తి చేయడానికి, ప్రపంచం దృష్టిని మరల్చడానికి ఐరాస వేదికను ఉపయోగిస్తోందని ఆమె ఆరోపించారు. అంతేకాకుండా.. ఇలా పాకిస్తాన్‌ ఐక్యరాజ్యసమితి వేదికను దుర్వినియోగాపరచడం ఇది మొదటిసారి కాదని చెప్పారు. పాకిస్తాన్‌ నాయకుడు నా దేశ అంతర్గత విషయాలను తీసుకురావడం ద్వారా.. ప్రపంచ వేదికపై అబద్దాలు ప్రచారం చేయడం ద్వారా ఈ ప్రతిష్టాత్మక ఫోరమ్‌ ప్రతిష్టను దిగజార్చడానికి చేసిన మరొక ప్రయత్నానికి మేము ప్రత్యుత్తరం ఇచ్చే హక్కును వినియోగించుకుంటామని ఆమె పేర్కొన్నారు. ఇంకా, స్నేహ దూబే ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించడం ద్వారా పాకిస్తాన్‌ ఒక అగ్నిమాపక వేషం వేసుకునే వ్యక్తి అని ఆరోపించింది. పొరుగున ఉన్న దేశాన్ని తన అక్రమ ఆక్రమణలో ఉన్న అన్ని ప్రాంతాలను వెంటనే ఖాళీ చేయమని హెచ్చరించింది. ఐరాసలో శుక్రవారం సాయంత్రం ప్రసారమైన తన ప్రీ`రికార్డింగ్‌ ప్రసంగంలో, పాకిస్తాన్‌ ప్రధాన మంత్రి ఇమ్రాన్‌ ఖాన్‌, 2019 లో ఆర్టికల్‌ 370 ని రద్దు చేస్తూ భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ ప్రసంగించారు. దీనికి ప్రతిస్పందనగా, భారత్‌ తరఫున స్నేహా దుబే అటువంటి ప్రకటనలు ‘అబద్దాన్ని పదేపదే చెప్పే వ్యక్తి మనస్తత్వం పట్ల మన సామూహిక ధిక్కారం అదేవిధంగా సానుభూతికి అర్హమైనవని అన్నారు.
“““““““““`