ఆగని ఎంపీ ఓ అక్రమ లీలలు..

బదిలీ వేటు పడ్డ కొనసాగుతున్న అక్రమ అనుమతులు
*ఇసుకలో సైతం నూనె తీయడం అతని సామర్థ్యం అంటున్న అధికారులు
*దుంపలకుంట చౌరస్తాలో తెల్ల కాగితాలపై అనుమతులు
డబ్బులు ఇస్తే అన్ని అనుమతులే..!
జనం సాక్షి/ కొల్చారం
మనోహరాబాద్ మండలంలో పలు అక్రమాలకు పాల్పడినట్లు ఫిర్యాదులు రావడంతో మనోహరాబాద్ పనిచేసిన లక్ష్మీ నర్సింలు మనోహరాబాద్ మండలంలో అక్రమాలకు పాల్పడడంతో జిల్లా కలెక్టర్ ఆదేశాలతో డిపిఓ సాయిబాబా విచారణ జరిపి అక్రమాలు నిజమని తేలడంతో మేముతోపాటు బదిలీ వేటు వేశారు. లక్ష్మీ నరసింహులు కొల్చారం ఎంపీవోగా గత నెల లో బాధ్యతలు చేపట్టాడు. మనోహరాబాద్ మండలంలో అక్రమ వెంచర్లు కు అనుమతులు ఇవ్వడంతో పాటు 60 గజాల లోపు ఇల్లు నిర్మిస్తున్న నిరుపేదల ఇండ్లను కూల్చి వేసిన సంఘటనలతో బాధితుల ఫిర్యాదు మేరకు కలెక్టర్ విచారణ జరిపి ఇతనిపై చర్య తీసుకోవడం జరిగింది. కొల్చారం మండలంలో బాధ్యతలు చేపట్టగానే ఇతని కన్ను కొల్చారం మండలంలో ప్రభుత్వ భూములు నిర్మిస్తున్న అక్రమ ఇండ్లు పై పడింది. ఎనగండ్ల పంచాయతీ సెక్రెటరీ శ్రీనివాస్ సాయంతో దుంపలకుంట శివారులోని సర్వే నంబర్ 330లో ఎనగండ్ల గ్రామం గ్రామం కు చెందిన కొందరు వ్యక్తులు రమా నిర్మిస్తున్నారు ప్రభుత్వ అసైన్మెంట్ భూములు నిర్మాణాన్ని ఆపాల్సిన ఎంపీఓ వారి వద్ద నుండి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసి పంచాయతీ కార్యదర్శులతో అనుమతులు ఇప్పిచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి ఇదే పంచాయతీ కార్యదర్శి గతంలో ఖాళీ స్థలం కు ఇంటి నిర్మాణం అనుమతి ఇవ్వడంతో పాటు ఖాళీ స్థలం కు పన్నులు సైతం వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి ఇద్దరూ తోడు దొంగలు కలిసి ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా ప్రభుత్వ భూములు ఇండ్ల నిర్మాణాన్ని కి అనుమతులు ఇస్తున్నారు. ఈ అసైన్మెంట్ భూమికి ప్రస్తుతం గజం ధర 15వేలపై పలుకుతుంది ప్రభుత్వ భూములు అమ్ముట కొనుట నిషేధం అని నిబంధనలు ఉన్నప్పటికీ రెవెన్యూ పంచాయతీరాజ్ అధికారుల అవినీతి కారణంగా ప్రభుత్వ భూములు అమ్మడం కొనడం జరుగుతూ ఉండడంతో పాటు ఇండ్ల నిర్మాణానికి సైతం అనుమతులు వస్తున్నాయి దీంతో దుంపలకుంట చౌరస్తా లో ధరలు ఆకాశాన్ని తాకాయి. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు విచారణ జరిపి బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకొనడంతో పాటు సంబంధిత పట్టాలను రద్దుచేసి ప్రభుత్వ అవసరాలకు వినియోగించాలని గ్రామస్తులు కోరుతున్నారు.