ఆగిన ఆర్‌టీసీ బస్సు

5

 

5A

– చర్చలు విఫలం

– నేటి నుంచి ఆర్‌టీసీ సమ్మె

హైదరాబాద్‌ మే5(జనంసాక్షి):   ఆర్టీసీ కార్మిక సంఘాలతో యాజమాన్యం చర్చలు విఫలమయ్యాయి. ప్రభుత్వ ఉద్యోగులతో సమాన వేతనాలపై యాజమాన్యం నుంచి హావిూ లభించకపోవడంతో చర్చలనుంచి ఈయూ, టీఎంయూ నేతలు బయటకు వచ్చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో డిమాాం పరిష్కరించలేమని, డిమాండ్ల పరిష్కారానికి మరికొంత గడువు ఇవ్వాలని యాజమాన్యం పేర్కొంది. ఇవాళే పరిష్కరించాలని కార్మిక సంఘాలు పట్టుబట్టాయి. మంత్రివర్గ ఉపసంఘం నివేదిక వచ్చేవరకు వేచిచూడాలని యాజమాన్యం పేర్కొంది. దీనికి అంగీకరించని సంఘాలు సమ్మెకు దిగాలని నిర్ణయించాయి. నేటి నుంచి (బుధవారం) సమ్మెలోకి వెళ్లనున్నట్లు  ఈయూ, టీఎంయూ నేతలు ప్రకటించారు. ఆర్టీసీ ఆర్థిక పరిస్థితి పేరు చెప్పి డిమాండ్లు పరిష్కరించట్లేదని వారు పేర్కొన్నారు. 27 శాతం ఫిట్‌మెంట్‌ ఇస్తామని యాజమాన్యం చెప్పిందన్నారు. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా 43 శాతం ఇవ్వాల్సిందేనని తాము అడిగామని వారు తెలిపారు. సమ్మెను జులై వరకు వాయిదా వేయాలని యాజమాన్యం కోరిందని, సమ్మె వాయిదా వేసేది లేదని తేల్చి చెప్పామని వారు తెలిపారు. ఇదిలావుంటే తెలంగాణ రవాణా శాఖ మంత్రి మహేందంరెడ్డితో ఆర్టీసీ అధికారులు భేటీ అయ్యారు. కార్మిక సంఘాలతో చర్చలు జరుపుతున్నామని ఆర్టీసీ ఎండీ సాంబశివరావు తెలిపారు. కార్మిక సంఘాలు కోరుతున్న ఫిట్‌మెంట్‌ ఇవ్వడానికి నిధుల కొరత ఉందని, సమ్మె పిలుపుతో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటామని ఎండీ తెలిపారు. అయితే ఆర్టీసీ యాజమాన్యంతో మంగళవారం కార్మిక సంఘాలు జరిపిన చర్చలు విఫలం అయ్యాయి.  ఆర్టీసీ కార్మికులకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనంపై యాజమాన్యం నుంచి హావిూ లభించలేదు. అయితే దీనిపై ప్రభుత్వంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఆర్టీసీ యాజమాన్యం చెబుతోంది. డిమాండ్ల  పరిష్కారానికి సమయం కావాలని,  జులై వరకూ సమ్మె వాయిదా వేసుకోవాలని యాజమాన్యం ఈ సందర్భంగా కార్మిక సంఘాలను కోరింది. ఆర్టీసీ కార్మికులు కోరుతున్నట్టుగా 43 శాతం ఫిట్‌మెంట్‌ చెల్లించాలని కార్మిక సంఘాలు డిమాాం చేస్తుండగా, ఆర్టీసీ యాజమాన్యం మాత్రం 28 శాతం ఫిట్మెంట్‌ ఇచ్చేందుకు అంగీకరించింది. కార్మిక సంఘాల చర్చలపై ఎండి సీఎంకు వివరించనున్నారు.  మరోవైపు  రవాణామంత్రి మహేందం రెడ్డితో కార్మిక సంఘాలు చర్చలు జరపనున్నారు.మరోవైపు మంగళవారం అర్ధరాత్రి నుంచి ఆర్టీసీ యూనియన్లు సమ్మెకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. ఫిట్‌మెంట్‌ బెనిఫిట్‌ ఇవ్వాలని కొంతకాలంగా అడుగుతున్నా ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో సమ్మెకు దిగుతామని ఆర్టీసీ యూనియన్లు హెచ్చరిస్తున్నాయి. దీంతో  తెలంగాణలో అర్థరాత్రి నుంచి బస్సులు ఎక్కడికక్కడే నిలిచిపోనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి సారించింది. ఇందుకోసం ఆర్టీసీ బస్సులను నడిపేందుకు  లారీలు, ప్రైవేటు బస్సు డ్రైవర్లకు అప్పగించేందుకు రంగం సిద్ధం చేస్తోంది.