ఆచార్య రంగాకు వెంకయ్య నివాళి
న్యూఢిల్లీ,నవంబర్7(జనంసాక్షి): ప్రముఖ స్వాతంత్య సమరయోధులు ఆచార్య ఎన్జీ రంగా జయంతి సందర్భంగా ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు నివాళులు అర్పించారు. తన నివాసంలో ఎన్జీ రంగా చిత్రపటానికి శ్రద్దాంజలి ఘటించారు. ట్విట్టర్ వేదికగా ఎన్జీ రంగా సేవలను గుర్తు చేసుకున్నారు. ప్రముఖ స్వాతంత్య సమరయోధులు, మాజీ పార్లమెంటు సభ్యులు, రైతు నాయకులు ఆచార్య ఎన్.జి.రంగా గారి 120వ జయంతి సందర్భంగా వారి స్మృతికి నివాళులు అర్పిస్తున్నాను. రైతు సంక్షేమం దిశగా వారి కృషి మరువలేనిది. అందరికీ ఆహారం అందించేందుకు ఆరుగాలం శ్రమించే అన్నదాతల సంక్షేమం, రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడం లాంటివి శ్రీ రంగా గారికి ఇచ్చే నిజమైన నివాళులని ట్వీట్ చేశారు.