ఆటోను ఢీకొన్న వ్యాను

హైదరాబాద్‌: మీర్‌పేట ధాతునగర్‌లో పాఠశాల విద్యార్థులతో వెళుతున్న ఆటోను డీసీఎం వ్యాను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన విద్యార్థులంతా స్పార్క్‌ స్కూల్‌కు చెందిన వారుగా గుర్తించారు. ఆటో డ్రైవర్‌ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్సచేస్తున్నారు.