ఆట స్థలాన్ని మార్చండి
చండ్రుగొండ జనంసాక్షి (జూలై 05) : మండల పరిధిలోని మద్దుకూరు లో క్రీడా మైదానాన్ని మార్చాలని అదే గ్రామానికి చెందిన యువకులు పంచాయతీ కార్యదర్శి కృష్ణ కుమారి, డిప్యూటీ తహసీల్దార్ ప్రసన్న, ఎంపీడీవో సూపరిండెంట్ నర్సింహారావు లకు మంగళవారం వినతి పత్రాన్ని అందించారు. ఈ సందర్బంగా యువకులు మాట్లాడుతూ గ్రామానికి ఆట స్థలం మంజూరు ఆనందంగా ఉందన్నారు. పాఠశాల సమీపంలో విద్యార్థులు ఇబ్బంది పడే అవకాశం ఉంటుందన్నారు. అలా కాకుండా వేరే స్థలంలో ఏర్పాటు చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో నాగేశ్వరరావు భార్గవ నరేష్ చరణ్ తేజ వీరేంద్ర ప్రసాద్ శ్రీను గోపి తదితరులు పాల్గొన్నారు.