ఆడపడుచులకు పెద్దన్నగా ముఖ్యమంత్రి కేసీఆర్.

జనగామ జిల్లా జడ్పీ వైస్ చైర్మన్ గిరబోయిన భాగ్యలక్ష్మి
బచ్చన్నపేట సెప్టెంబర్ 26 (జనం సాక్షి ) తెలంగాణ ఆడపడుచులు ఎంతో సంతోషంగా జరుపుకునే బతుకమ్మ పండుగకు ఇంటికి పెద్దన్నగా ప్రతి ఇంటి ఆడపడుచుకు సారే ఇచ్చి గౌరవించడం భారతదేశంలో ఒక కేసీఆర్కే చెల్లుతుందని జనగామ జడ్పీ వైస్ చైర్మన్ గిరబోయిన భాగ్యలక్ష్మి అంజయ్య అన్నారు. సోమవారం బచ్చన్నపేట మండలంలోని చిన్న రామచంద్ర గ్రామంలో గ్రామ సర్పంచి ఖలీనా బేగం ఆజాం ఆధ్వర్యంలో బతుకమ్మ చీరల పంపిణీ చేయడం జరిగింది. అనంతరం ఆమె మాట్లాడుతూ దేశంలోనే ఇక్కడ లేని విధంగా తెలంగాణలో పువ్వులను దేవతగా ప్రకృతిని దైవంగా పూజించే సాంప్రదాయం సంస్కృతి ఒక్క తెలంగాణ లోనే ఉన్నదని ఇలాంటి సాంప్రదాయాలను సంస్కృతిని గౌరవించి మహిళలకు షాదీ ముబారక్. కళ్యాణ లక్ష్మి. కెసిఆర్ కిట్టు. బతుకమ్మ పండుగకు చీరలు ఇచ్చి మహిళలకు సముచిత గౌరవాన్ని ఇచ్చి రాష్ట్ర ప్రజలను కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారని ఆమె అన్నారు. అంతేకాకుండా పద్మశాలీలకు ఉపాధి కల్పిస్తూ చీరలనే కాకుండా తువ్వాలలో. శాలువాలు పంచలు. కాటన్ బట్టలను తయారు చేయించి ఎంతోమంది కుటుంబాలకు ఉపాధి కల్పించిన ఘనత కెసిఆర్ కి దక్కుతుందని అన్నారు. దేశంలోని ఏ రాష్ట్రమైనా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రాన్ని ఆదర్శంగా తీసుకొని అభివృద్ధిలో ముందుకు పోయే విధంగా కేసీఆర్ సంక్షేమ పథకాలే ఎందుకు నిదర్శనం అని వారు తెలిపారు. మండలంలోని బోన కొల్లూరు సర్పంచ్ . మీసా ఐలమల్లు. బసిరెడ్డిపల్లి సర్పంచ్ బాలగోని పరశురాములు. నారాయణపురం సర్పంచ్ మాసాపేట రవీందర్ రెడ్డి. కొన్నే సర్పంచ్ వేముల వెంకటేష్ గౌడ్. సాల్వాపూర్ సర్పంచ్ కీసర లక్ష్మి. ఎంపీటీసీ గూడెపు లతా శ్రీ. గ్రామస్తుల ఆధ్వర్యంలో పంపకం జరిగింది