ఆడపిల్లను పుట్టనిద్దాం.. బతకనిద్దాం..చదవనిద్దాం..
వరంగల్ ఈస్ట్ ,అక్టోబర్ 11(జనం సాక్షి)
ఆడపిల్లలను పుట్టనిద్దాం.
.. బతకానిద్దాం ..చదవనిద్దాం ఎదగనిద్దాం అనే భావనతో బాలికల సంరక్షణకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని వరంగల్ మాజీ బాలల సంరక్షణ కమిటీ ఛైర్పర్సన్ మండల పరుశురాములు పేర్కొన్నారు. మంగళవారం అంతర్జాతీయ బాలికా దినోత్సవాన్ని పురష్కరించుకుని మహాత్మా జ్యోతరావు పులే పాఠశాలలో లో అభ్యుదయ సేవ సమితి ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జరిగింది. ఈ సదస్సుకు ముఖ్య అతిధిగా మండల పరుశురాములు హాజరై మాట్లాడుతూ ఆడ పిల్లలను పుట్టనిద్దాం.. వారిని పెరగనిద్దాం, చదువద్దామన్నారు.. కుటుంబంలో ఎంతమంది మగపిల్లలున్నా ఆడపిల్ల అంటే మహాలక్ష్మితో పోల్చుతారని అలాంటి ఆడపిల్లను గర్భంలో ఉండగానే తొలగిస్తున్నారని అవేదన చెందారు. సమాజంలో మార్పు రావాలని,అది కుటుంబం నుండే రావాలన్నారు. చిన్న పిల్లలను మొదలుకొని పండు ముసలి మహిళను కూడా వదలకుండా అత్యాచారాలు, హత్యలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. నేటి ఆడపిల్లనే రేపు అమ్మగా ఉద్భవిస్తుందన్న అంశాన్ని ప్రతిఒక్కరూ గుర్తుంచుకోవాలని హితవు పలికారు. అమ్మ లేనిది సృష్టి లేదనేది తెలుసుకోవాలని, అందుకే మాతృత్వాన్ని బ్రతికించాలంటే ఆడ పిల్లల్ని రక్షించుకోవాల్సిన బాధ్యత ఉందన్నారు.
ఎవరైనా బాల్యవివాహలకు పాల్పడితే శిక్షార్షులు అవుతారన్నారు.సమాజంలో బాలికలు చక్కగా చదువుకుని ఉన్నత స్థానంలో నిలవాలని సూచించారు. బల బాలికలు చదువు విషయంలో నిర్లక్ష్యం చేయరాదన్నారు.
ఇంకా ఈ కర్యక్రమంలో ప్రిన్సిపాల్ అంజయ్య, పాఠశాల ఉపాధ్యలు , బాలబాలికలు పలుగొన్నరు