ఆడపిల్లలకు అండగా నిలిచిన పెద్దన్న కెసిఆర్‌

ప్రచారంలో రేఖానాయక్‌

ఆదిలాబాద్‌,నవంబర్‌2(జ‌నంసాక్షి): పేదకుటుంబాలకు ఆడపిల్ల పెళ్లి భారంగా మారుతున్న పరిస్థితిలో వారి పెళ్లి ఘనంగా జరగాలనీ, వారికి 1,00,116కు పెంచి ఇచ్చిన ఘనత సిఎం కెసిఆర్‌దని ఖానాపూర్‌ టిఆర్‌ఎస్‌ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్‌ అన్నారు. అలాగే వ్యవసాయరంగాన్ని అభివృద్ధి చేసేందుకు

ఎరువులు, ఇతరపెట్టుబడి కోసం ఎకరానికి 8వేలు అందిచారని, ఇప్పుడు ఆ సాయాన్ని 10వేలకు పెంచనున్నారని వివరించారు. గొల్లకురుమలకు ప్రతి కుటుంబానికి గొర్రెల యూనిట్‌ ఇస్తున్నట్లు చెప్పారు. పాడి రైతుల కోసం ఇంటికో బర్రెను అందిస్తున్నామన్నారు. మత్స్యకార్మికుల సంక్షేమం కోసం తెలంగాణ చెరువులు, రిజర్వాయర్లలో చేపల పెంపకం చేపట్టామని తెలిపారు. పేదల కోసం పనిచేసినవారికే మళ్లీ పట్టం కట్టాలని మాజీ ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. అభివృద్ధిలో తెలంగాణను దేశంలోనే అగ్రగామిగా నిలిపిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని స్పష్టం చేశారు. తెలంగాణ కోసం కేసీఆర్‌ తన ప్రాణాన్ని ఫణంగా పెట్టారనీ, రాష్ట్రాన్ని సాధించి తొలి ముఖ్యమంత్రిగా అభివృద్ధిలో నిలిపారని కొనియాడారు. రానున్న పదేండ్లలో రాష్ట్రంలో నిరుపేదలు లేకుండా చూడాలన్నదే కేసీఆర్‌ కల అని చెప్పా రు. రైతుల కోసం అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చారనీ, యాదవులకు సబ్సిడీ గొర్రెలు ఇప్పించారని గుర్తు చేశారు. తాగునీటి కోసం మిషన్‌ భగీరథ, సాగునీటి కోసం కాళేశ్వరం ప్రాజెక్టును చేపట్టారని తెలిపారు. అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలంటే టీఆర్‌ఎస్‌కే పట్టం కట్టాలని పిలుపునిచ్చారు.