ఆడబిడ్డలకు బతుకమ్మ చీరల పంపిణీ
శంకరపట్నం జనం సాక్షి సెప్టెంబర్ 24 తెలంగాణలో ఏడాదికి ఒక్కసారి తీరక్క పూలతో పేర్చి దేవతల కొలిచే బతుకమ్మ పండుగను జరుపుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు చీరలను సారేగా పంపిణీ చేస్తున్నారని మానకొండూరు నియోజకవర్గ ఎమ్మెల్యే రసమయ బాలకిషన్ అన్నారు బతుకమ్మ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న చీరలను శనివారం శంకరపట్నం మండలం పరిధిలోని రైతు వేదిక లో మహిళలకు టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు సుడా చైర్మన్ జీవి రామకృష్ణారావుతో కలిసిఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ మాట్లాడుతూ ఎన్నడూ లేని విధంగాతెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డ నుంచి పుట్టిన బిడ్డ నుంచి ముసలితనం వరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి కంటికి రెప్పలా కాపాడుకుంటుందని అన్నారు బతుకమ్మ పండుగను ఘనంగా జరుపుకోవాలని పేదింటి మధ్యతరగతి కుటుంబాల ఆడపడుచులకు పెద్దన్నగా బతుకమ్మ చీరల పంపిణీ ప్రతిఏడాది చేస్తున్నారని గుర్తు చేశారు బీరప్ప పూలతో పేర్చే కొలిచే బతుకమ్మ పండుగను ప్రపంచంలో గుర్తింపు పొందడం తెలంగాణ ఆడబిడ్డలకు అరుదైన గౌరవమని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో శంకరపట్నం జడ్పిటిసి లింగంపల్లి శ్రీనివాస్ రెడ్డి ఎంపీపీ ఉమ్మంతల సరోజన వైస్ ఎంపీపీ పులికోట రమేష్ టిఆర్ఎస్ మండలాధ్యక్షుడు గంట మైపాల్ టిఆర్ఎస్ సర్పంచులు టిఆర్ఎస్ ఎంపీటీసీలు సహకార సంఘం అధ్యక్షులు టిఆర్ఎస్ నాయకులు మహిళలు తదితరులు పాల్గొన్నారు