ఆత్మవిశ్వాసానికి మారుపేరు… – మనోనేత్రమే.. వారికి మార్గం…

గోదావరిఖని, జులై 28 (జనంసాక్షి) : వారికి కళ్లు కనిపించవు చెవులు వినిపించవు మాటలు రావు అయినా వారు ‘మనో’నేత్రంతో ప్రపంచాన్ని చూస్తున్నారు ఆలోచిస్తున్నారు సమాజాన్ని చదువుతున్నారు. ఒకరు కాదు ఇద్దరు కాదు ఒకే కుటుంబంలోని ఎనిమిది మంది ఇదే పరిస్థితిలో ఉన్నారు. నిరుపేద కుటుంబంలో జన్మించినా ప్రపంచాన్ని చూడలేకపోయినా ఆత్మవిశ్వాసానికి మారుపేరుగా వారు వేస్తున్న ముందడుగు సజీవ సాక్ష్యంగా ఉంది. సామాజిక జీవనంలో మేము సైతమంటూ తమ ఆలోచనలకు పదును పెడుతున్నారు. దుర్భరమైన అంగవైకల్యంతో తమ పనితనాన్ని ప్రదర్శిస్తున్నారు. చూపరులను అబ్బురపరుస్తున్నారు. ఈ అరుదైన కుటుంబ జీవనం అందరిని కంటతడి పెట్టిస్తోంది. బాధను తెచ్చిపెడుతోంది. ఇదే సమయంలో ఆశ్చర్యాన్ని కూడా కలిగిస్తోంది. వివరాలు ఇలా ఉన్నాయి. స్థానిక మార్కండేయకాలనీలో ఖాసీం అనే కూలీ కుటుంబంలో చీకటి ఆవరించింది. అతనికి పుట్టిన సంతానంలో పెద్ద కొడుకు అస్లాం తప్ప మిగిలిన వారద్దరికి చూపు లేదు మాట లేదు శబ్దధ్వని లేదు కానీ, ఆలోచనలు మాత్రం అమోఘంగా ఉన్నాయి. అమ్లక్‌, అక్రమ్‌, ఫాతిమా, సబీరా వీరంతా అంగవైకల్యంతో బాధపడుతున్నారు. అలాగే, అస్లాంకు జన్మించిన సంతానంలో నలుగురు కూడా ఇదే అంగవైకల్యంతో దుర్భర జీవితాన్ని గడుపుతున్నారు. ఇంటి పెద్ద ఖాసీం అనారోగ్యంతో మృతిచెందగా ఈ కుటుంబ బాధ్యతనంతా అస్లాం మోస్తున్నాడు. స్థానిక కొత్త కూర గాయాల మార్కెట్‌లో అల్లం, వెల్లుల్లి వ్యాపారం చేస్తు కుటుంబాన్ని అరకొర జీవనంతో ముం దుకు నడిపిస్తున్నా రు. ఇక్కడి వరకు బాగానే ఉన్నప్పటికి అన్నకు తమ పోషణ భారం బాధపెడుతు న్నదని అమ్లక్‌, అక్రమ్‌ భావించారే మోకానీ అడుగులు ముందుకు వేయిం చలేని అంగవైకల్యం తో కూడా సైకిల్‌ షా పులో పనిచేస్తున్నా రు. ఉదయం ఇంటి నుంచి అమ్లక్‌ బయ లుదేరి, స్థానిక స్వతంత్రచౌక్‌లోని సౌకత్‌ సైకిల్‌షాపుకు ఎవరి సహాయం లేకుండానే చేరుకుంటాడు. సైకిల్‌ షాపు యజమాని చూపించే స్పర్శతో సైకిల్‌ను చక్కగా మరమ్మతు చేస్తాడు. ఇదే తరహాలో అక్రమ్‌ కూడా సాయంత్రం ఇదే సైకిల్‌షాపుకు చేరుకుని మర మ్మతులు చేస్తాడు. ఇది సాధ్యం కాదనిపించిన ఈ ఇద్దరు మనోనేత్రంతో జీవితచక్రంలో ఓ చరిత్రను సృష్టిస్తున్నారు. ఇక మిగిలిన ఆ కుటుంబంలోని ఆరుగురు ఆడపిల్లలు కావడంతో ఇంటిపనులను నిర్వహిస్తున్నారు. ప్రభు త్వం నుంచి వీరికి ఎటువంటి ప్రయోజనం లభించలేదు. ఎన్నిసార్లు అర్జీ సమర్పించిన అధికారులు స్పందించలేదు. అంగవైకల్యంతో బాధపడుతున్న ఈ ఎనిమిది మందికి పెన్షన్‌ అతీగతి లేదు.