ఆత్మహత్యలు పరిష్కారం కావు

42813629ప్రత్యూష బెనర్జీ ఆత్మహత్యపై హేమమాలిని కామెంట్‌
ముంబై ఏప్రిల్‌5

ప్రముఖ టీవీ నటి ప్రత్యూష బెనర్జీ ఆత్మహత్య బాలీవుడ్‌ అలనాటి కథనాయిక, ఎంపి  హేమామాలిని స్పందించారు. ఆమె ఆత్మహత్య మూర్ఖమైన చర్యని హేమ అభిప్రాయపడింది. చేజేతులా ప్రాణాలు తీసుకొనే ఇలాంటి ధోరణి ఎంతమాత్రం సబబు కాదంటూ కొన్ని పరుషమైన వ్యాఖ్యలు ఆమె ట్విట్టర్లో చేసింది. అన్ని మూర్ఖమైన ఆత్మహత్యలే. వాటివల్ల ఏవిూ జరుగదు. జీవితం దేవుడు ఇచ్చిన కానుక. అది జీవించేందుకు ఉంది కానీ మనకు నచ్చినప్పుడు ప్రాణాలు తీసుకోవడానికి కాదు. ప్రాణాలు తీసుకొనే హక్కు మనకు లేదు అని హేమామాలిని పేర్కొంది. కష్టాలను ఎదుర్కొని ఎలా విజయం సాధించాలో ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలి. అంతేకానీ ఒత్తిడికి తలొగ్గి ప్రాణాలు తీసుకోకూడదు. ప్రపంచం పోరాడేవారినే కీర్తిస్తుంది. కానీ పరాజితులను కాదు అని తెలిపింది. ‘సెలబ్రిటీ ఆత్మహత్యలు ఆకలిగొన్న విూడియాకు ఆహారంలాంటింది. మరో సెన్సేషనల్‌ వార్త వచ్చేవారకు దానిని ప్రసారం చేస్తుంది. ఆ తర్వాత మరిచిపోతుంది’ అని హేమ పేర్కొంది. వ్యక్తిగత సమస్యలు, చిన్న చిన్న కారణాలకే ఆత్మహత్యలు చేసుకుంటూ నిండు ప్రాణాలు తీసుకుంటున్న ఘటనలపై బాలీవుడ్‌ ప్రముఖ నటి, ఎంపీ హేమమాలిని తీవ్రంగా స్పందించారు. ఆత్మహత్యే అన్ని సమస్యలకు పరిష్కారం కాదని ఆమె అన్నారు. ఆత్మహత్యలతో ఏవిూ సాధించలేం.. జీవితం దేవుడిచ్చిన గొప్ప వరం. దాన్ని సంపూర్ణంగా జీవించాలి, కానీ.. ఇలా ప్రాణాలు తీసుకునే హక్కు మనకు లేదు. సమస్యలను అధిగమించి.. ముందుకు వెళ్లాలి కానీ.. వాటి కారణంగా నిండు జీవితాన్ని మధ్యలోనే వదిలేయొద్ద’ని హేమమాలిని ట్వీట్‌ చేశారు. బుల్లితెర ప్రముఖ నటి ప్రత్యూష బెనర్జీ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఇప్పుడు సంచలనంగా మారిన విషయం తెలిసిందే. రోజుకో కొత్త మలుపు తిరుగుతున్న ఈ కేసులో ఇంతవరకు ఆమె ఆత్మహత్యకు దారి తీసిన కారణాలు తెలియరాలేదు. ఈ నేపథ్యంలోనే హేమమాలిని పై విధంగా స్పందించారు.