*ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి కుటుంబానికి ఆర్థిక సహాయాన్ని అందజేసిన ఏఐసీసీ కార్యదర్శి చిన్నారెడ్డి*
*గోపాల్ పేట్ జనం సాక్షి సెప్టెంబర్ (18):* మండల కేంద్రంలో శనివారం అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న పరశురాములు కుటుంబాన్ని ఆదివారం కాంగ్రెస్ పార్టీ నాయకులు పరామర్శించి ఏఐసీసీ కార్యదర్శి జిల్లెల చిన్నారెడ్డి పరశురాములు కుటుంబానికి ఐదు వేల రూపాయలు ఆర్థిక సహాయాన్ని గోపాల్ పేట్ కాంగ్రెస్ నాయకులు మృతుని కుటుంబానికి అందజేశారు. ఆర్థిక ఇబ్బందులతో మరణించిన పరశురాముల కుటుంబాన్ని ప్రభుత్వ పరంగా ఆదుకోవాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్సీ ఉపాధ్యక్షులు కొంకి వెంకటేష్, గ్రామ అధ్యక్షులు శివన్న, యూత్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు కొంకీ రమేష్, గ్రామ యూత్ అధ్యక్షుడు బాలపిరు, గ్రామ కాంగ్రెస్ నాయకులు, దేవరాజు, వెంకటయ్య, బాలకృష్ణ, కిషోర్, ప్రేమ్ కుమార్, శంకర్, తదితరులు పాల్గొన్నారు