ఆదాయా పెరిగినా అభివృద్ది శూన్యం

The Union Minister for Finance and Corporate Affairs, Smt. Nirmala Sitharaman along with the Ministers of State for Finance, Shri Pankaj Chaudhary as well as her Budget Team/senior officials of the Ministry of Finance arrived at the Parliament House to present the first Union Budget 2024-25 of Modi 3.0, in New Delhi on July 23, 2024.

బడ్జెట్‌ కేటాయింపుల తీరుపై సర్వత్రా విమర్శలు
న్యూఢల్లీి, జులై 24 (జనం సాక్షి)  కేంద్ర ప్రభుత్వ ఆదాయంలో పెరుగుదల 14.5 శాతం మేర ఉండగా, వ్యయంలో పెరుగుదల 5.94 శాతం మాత్రమే! పెరిగిన ఆదాయాన్ని ఆర్థిక కార్యకలాపాల విస్తరణకు ఉపయోగిస్తే` యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. కానీ, ఈ బడ్జెట్లో ఆ మొత్తాన్ని జిడిపిలో ఆర్థికలోటు తగ్గించే అంకెల విన్యాసం వైపు మళ్లించారు. ఇది కార్పొరేట్లను,అంతర్జాతీయ ఫైనాన్స్‌ పెట్టుబడిదారులను సంతృప్తపరిచే చర్యే తప్ప` దేశ ప్రజలకు దోహదపడేది కాదు. ఆర్థిక సంఘం ద్వారా రాష్టాల్రకు జరిపే నిధుల కేటాయింపు బిజెపి హయాంలో అంతకంతకు కుదించుకుపోతోంది. 2022 బ్జడెట్‌తో పోలిస్తే ఈసారి ఏకంగా రూ.40 వేల కోట్లకు ఎగనామం పెట్టేశారు! ప్రతిపక్షాల ఏలుబడిలో ఉన్న రాష్టాల్రకు మరింత ద్రోహం చేయటానికి ఇది దారి తీయొచ్చు! ప్రభుత్వరంగంలోని రూ.50 వేల కోట్ల మేర వాటాల ఉపసంహరణకు ప్రతిపాదించటం మరీ దారుణం. ఈసారి కూడా కేటాయింపుల్లో తీరని ద్రోహం జరిగింది. గొప్ప సాయం అందిస్తున్నట్టు ప్రసంగంలో ప్రవచించినా, నిజంగా చూపిన ప్రేమ శూన్యం. ఎపి విభజన చట్టంలోని ఏ ఒక్క హావిూని నెరవేర్చటానికి నిర్ధిష్టమైన ప్రస్తావన కానీ, కేటాయింపులు కానీ చేయలేదు. రాజధాని నిర్మాణానికి రూ.15 వేల కోట్ల నిధులను అంతర్జాతీయ ద్రవ్య సంస్థల ద్వారా రుణం తీసుకోవ
టానికి సాయపడతామని చెప్పారే కానీ, గ్రాంటుగా ఒక్క రూపాయి కూడా విదిలించలేదు. ఈ అప్పును ఎవరు చెల్లిస్తారో, వడ్డీని ఎవరు భరిస్తారో స్పష్టత లేదు. అప్పు ఇప్పించటమే ఒక ఘనమైన సహాయం అని కేంద్రం మభ్యపెట్టదలిస్తే అది రాష్ట్ర ప్రజలతో క్రూర పరిహాసమే! పోలవరం ప్రాజెక్టు గురించి గొప్ప ప్రస్తావనలు చేసినా, నిధుల కేటాయింపు విూద కానీ, నిర్వాసితులకు పునరావాసం విూద కానీ ఒక్క మాటా లేదు. విశాఖ రైల్వే జోనూ, కడప స్టీలు ఫ్యాక్టరీ ఊసే లేదు. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రయివేటీకరించ బోమని ఆ మధ్య కేంద్ర మంత్రి కుమారస్వామి విశాఖలో కుంటి తుడుపు ప్రకటన చేశారు కానీ, ఈ బ్జడెట్లో అలాంటి భరోసా ఏవిూ ఇవ్వలేదు. వెనకబడిన జిల్లాలకు సహాయం జాబితాలో ప్రకాశంను కూడా కలపటం హర్షించదగ్గదే కానీ, కొద్దిపాటి విదిలింపు నిధులతో ఒరిగేదేవిూ ఉండదు. ఈ బ్జడెట్‌ ద్వారా రాష్టాన్రికి మేలు జరిగిపోయినట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ హర్షం వ్యక్తం చేయడం తొందరపాటే అవుతుంది. విభజన హావిూలను అమలు జరపటం కేంద్ర ప్రభుత్వ బాధ్యత. రాజధాని నిర్మాణానికి, పోలవరం పూర్తికి, ఇతర అభివృద్ధి కార్యక్రమాలకూ తగినన్ని నిధులు పొందటం మన హక్కు. గట్టిగా అడిగి, పోరాడి సాధించాలి. లేదంటే ఇలాంటి ప్రసంగాల ప్రహసనాలతో, అంకెల గారడీలతో మళ్లీ మళ్లీ మోసపోతూనే ఉంటాం. రాష్ట్ర విభజన జరిగి, పదేళ్లు గడిచిపోయాక కూడా ’అన్ని హావిూలూ అమలు చేస్తా’మన్న దగ్గరే బిజెపి ప్రభుత్వం ఆగిపోవటాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించకూడదు.