ఆదిలాబాద్‌ జిల్లాలో కండెన్సర్‌ పేలి మహిళ మృతి

పనికిరాని ఎలక్ర్టికల్‌ వస్తువులు తగలబెడుతుండగా అందులో ఉన్న కండెన్సర్‌ పేలిన ఘటనలో ఓ మహిళ మృతిచెందింది. ఆదిలాబాద్‌ జిల్లా కుబీర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇంట్లో పేరుకు పోయిన పనికిరాని ఎలక్ర్టికల్‌ వస్తువులను ఒకచోట పోగేసి తగలబెడుతుండగా అందులోని కండెన్సర్‌ ప్రమాదవశాత్తు భారీ శబ్దంతో పేలింది. దీంతో అక్కడే ఉన్న మహిళ పేలుడు ధాటికి అక్కడికక్కడే మృతిచెందింది.