ఆదిలాబాద్‌ జిల్లాలో ప్రశాంతంగా ‘సహకార’పోలింగ్‌

ఆదిలాబాద్‌, జనవరి 31 (): జిల్లాలో సహకార సంఘాల ఎన్నికలలో భాగంగా తొలి విడతగా గురువారం పోలింగ్‌ జరుగుతోంది. ఉదయం 7 గంటల నుంచి ప్రారంభమైన పోలింగ్‌ ప్రశాంతంగా జరుగుతుందని సమాచారం అందింది. ఎన్నికల సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మద్యం దుకాణాలను పూర్తిగా బంద్‌ చేశారు. మొదటి విడతలో 38 సంఘాల పరిధిలోని 486 ప్రాదేశిక నియోజవకవర్గాలలో 149 ఏకగ్రీవంగా ఎన్నిక కావడంతో మిగతా 337 ప్రాదేశిక నియోజవకవర్గాలకు గురువారం పోలింగ్‌ జరుగుతోంది. ఈ ఎన్నికల్లో 1345 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఆదిలాబాద్‌లో ఇందుకు గాను 337 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేయగా 1011 మంది సిబ్బంది పోలింగ్‌ కార్యక్రమంలో పని చేస్తున్నారు. ఆదిలాబాద్‌ డివిజన్‌లోని 13 సంఘాల పరిధిలో 167 ప్రాదేశిక నియోజకవర్గాలలో 70 ఏకగ్రీవం కాగా మిగిలినవి 70 స్థానాలకు పోలింగ్‌ జరుగుతోంది. నిర్మల్‌ డివిజన్‌ పరిధిలోని 9 సంఘాలోని 117 ప్రాదేశిక నియోజవకర్గాలలో 26 ఏకగ్రీవంగా ఎన్నిక కాగా మిగిలిన 90 స్థానాలకు పోటీ నెలకొంది. మంచిర్యాల డివిజన్‌లోని 16 సంఘాల్లో 208 స్థానాలకు గాను 59 ఏకగ్రీవంగా ఎన్నిక కాగా మిగిలిన 155 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ పోలింగ్‌ కార్యక్రమం మధ్యాహ్నం 2 గంటల వరకు పోలింగ్‌ జరుగుతోంది.