ఆదిలాబాద్ జిల్లాలో భూకంప వదంతులు
ఆదిలాబాద్: భూకంపం వస్తోందనే వదంతులు శుక్రవారం రాత్రి జిల్లావాసులకు కంటి మీద కునుకు లేకుండా చేశాయి. ఆంధ్రా-మహారాష్ట్ర సరిహద్దులోని పలు గ్రామాల్లో వదంతులు రావడంతో ప్రజలు పెద్దయెత్తున వీధుల్లోకి పరుగులు తీశారు. అర్థరాత్రి 2 గంటల నుంచి రోడ్లపైనే జాగారం చేశారు. భూకంప వందతులతో నిర్మల్, ఉట్నూరు, సారంగపూర్ మండలాల్లోని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. దీనిపై స్పందించిన అధికారులు ఇవి కేవలం వదంతులు మాత్రమేనని కొట్టిపారేశారు. వదంతులు నమ్మి ప్రజలు ఆందోళన చెందవద్దని వారు విజ్ఞప్తి చేశారు.