ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన్న మాతృమూర్తి జోగు బోజమ్మ (98) మరణం పట్ల

మాజీ మంత్రి , ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన్న మాతృమూర్తి జోగు బోజమ్మ (98) మరణం పట్ల రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి  సంతాపం ప్రకటించారు. జోగు రామన్న కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. బోజమ్మ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు.