ఆధారాలు ఉంటేనే అగ్రిగోల్డ్‌ చెల్లింపులు: డిజిపి

న్యూఢిల్లీ,అక్టోబర్‌30(జ‌నంసాక్షి): అగ్రిగోల్డ్‌ ఖాతాదారుల లెక్కాపత్రాలు తేల్చుతున్నామనిడీజీపీ సాంబశివరావు అన్నారు. ఆధారాలు లేకపోతే డబ్బు తిరిగి చెల్లించడం కుదరదని డీజీపీ అన్నారు. గంజాయి విషయంలో ఎక్సైజ్‌ శాఖతో కలిసి పనిచేస్తున్నామని అన్నారు. విశాఖలో విద్యార్థులపై తీవ్ర ప్రభావం పడుతోందని డీజీపీ స్పష్టం చేశారు. ఇలాగే కొనసాగితే ఒక తరం పూర్తిగా నాశనమవుతుందని డీజీపీ తెలిపారు. తిరుపతి, విశాఖ, గుంటూరులో వరుసగా జరిగిన రౌడీషీటర్‌ హత్యలకు కారణాలేమిటో తెలుసుకుంటామని డీజీపీ చెప్పారు. చెన్నై-కోల్‌కత్తా హైవేపై 5-10శాతం ప్రమాద మరణాలు తగ్గాయని డీజీపీ వెల్లడించారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులపై అధికారులతో చర్చించానని ఏపీ డీజీపీ సాంబశివరావు చెప్పారు. యుటిలైజేషన్‌ సర్టిఫికెట్లలో జాప్యం వల్ల నిధులు రాలేదని డీజీపీ అన్నారు. ఎస్‌ఆర్‌ఎస్‌, ఎస్‌ఐఎస్పీ పథకాల కింద కేంద్రం నిధులు ఇస్తోందన్నారు. రోడ్ల అభివృద్ధి కోసం రూ. 1,200 కోట్లు విడుదల చేశామని డీజీపీ తెలియజేశారు. నిర్భయ ఫండ్‌ నుంచి ఏపీకి రూ. 7 కోట్లు విడుదల అయ్యాయని డీజీపీ తెలిపారు. భద్రత కోసం యాప్‌ రూపొందించి, పెట్రోలింగ్‌ పెంచుతున్నామని ఆయన చెప్పారు. పోలీసు శాఖ ఆధునీకరణ కోసం రూ. 70 కోట్లు ఇచ్చారని డీజీపీ అన్నారు. గ్రేహౌండ్స్‌ శిక్షణా కేంద్రం కోసం 2 వేల ఎకరాలు అటవీ భూమి అడిగామన్నారు. ప్రతిగా మరో చోట భూమిని కేటాయించామని డీజీపీ సాంబశివరావు స్పష్టం చేశారు.