ఆధార్‌తో భూరికార్డుల అనుసంధానం: కలెక్టర్‌

జగిత్యాల,జనవరి23(జ‌నంసాక్షి): క్రమబద్ధీకరించిన భూముల విషయంలో శ్రద్ధ చూపాలని ప్రతి ఒక్కరిని ఆధార్‌తో అనుసంధానించి వందశాతం దస్త్రాల పక్రియ పూర్తి చేయాలని కలెక్టర్డాక్టర్‌ ఎ.శరత్‌ ఆదేశించారు.ధరణిపై సవిూక్ష జరిపి లోపాలు ఉంటే చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించాలని కలెక్టర్‌ అన్నారు. జనవరి 1 నాటికి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరిని ఓటరుగా నమోదు చేయాలని బూత్‌స్థాయి అధికారులు ఇంటింటికి వెళ్లి ఈ నెల 25లోగా వందశాతం ఓటరు నమోదు పక్రియ పూర్తి చేయాలన్నారు. సంబంధిత తహసీల్దార్లు పోలింగ్‌ కేంద్రాల వారీగా ఓటర్ల జాబితాను పరిశీలించి కొత్తగా అర్హులైన వారి పేర్లను జాబితాలో చేర్చాలని ఓటరు జాబితాలో పేర్లు ఉండి విదేశాలు ఇతర జిల్లాలకు మారిన వారు మృతి చెందిన వారి పేర్లను తొలగించాలన్నారు. ఓటర్ల జాబితాలో ఫొటోలు, ఇంటి నెంబర్లు తదితర వివరాలను సరిచూసుకోవాలని ఓటరు నమోదు ఓటు హక్కు వినియోగంపై ప్రజలకు అవగాహన కలిగేవిధంగా ఇంటింటి పత్రులను పంపిణీ చేయాలన్నారు.