ఆధార్‌ విచారణపై ఐదుగురు సభ్యుల ధర్మాసనం

న్యూఢిల్లీ,అక్టోబర్‌30(జ‌నంసాక్షి): ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు పొందేందుకు ఆధార్‌ను తప్పనిసరిగా అనుసంధానించాలన్న కేంద్ర నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణను కొనసాగించేందుకు ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు సుప్రీంకోర్టు సోమవారంనాడు ప్రకటించింది. నవంబర్‌ చివరి వారం నుంచి ఈ ధర్మాసనం విచారణ చేపడుతుందని తెలిపింది. ఆధార్‌ కార్డును తప్పనిసరి చేయడంపై సుప్రీంకోర్టుకు వెళ్లిన పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పిటిషన్‌పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఐదుగురు సభ్యుల ధర్మాసనాన్ని ప్రకటించింది. ఆధార్‌ అనుసంధాన్ని సవాలు చేసిన మమతా బెనర్జీ వాదనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఒక సమాఖ్య (ఫెడరల్‌) దేశంలో పార్లమెంటు తప్పనిసరి చేసిన విషయాన్ని సవాలు చేస్తూ ఒక రాష్ట్రం ఎలా పిటిషన్‌ దాఖలు చేస్తుంది? అని కోర్టు ప్రశ్నించింది. ‘ఈ అంశం విచారణకు ఆమోదయోగ్యమైనదేనని మాకు తెలుసు. అయితే ఒక రాష్ట్రం ఎలా సవాలు చేయగలదన్న దానిపై విూరు సంతృప్తికరమైన సమాధానం చెప్పాలి’ అని వ్యాఖ్యానించింది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యక్తులు సవాలు చేయవచ్చు కానీ, రాష్టాల్రు సవాలు చేయలేవని పేర్కొంది. వ్యక్తిగత ¬దాలో మమతా బెనర్జీ దీన్ని సవాలు చేస్తారా అనేది తమకు తెలియజేయాలని ధర్మాసనం పేర్కొంది.