ఆధునిక వ్యవసాయంపై అవగాహన
గుంటూరు,జూలై13(జనంసాక్షి ): వ్యవసాయ రంగంలో వస్తున్న నూతన సాంకేతిక పరిజ్ఞానంపై రైతుల్లో అవగాహన కల్పించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ ఆధునికత యాంత్రీకరణపై అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నది. అధునాతన పనిముట్లు, యంత్రాలపై అవగాహన కల్పిస్తున్నామన్నారు. రైతులకు అవసరమైన వ్యవసాయ యాంత్రీకరణకు నిధులు కేటాయించారు. ఆచార్య ఎన్జీ రంగా యూనివర్సిటీ, ఏపీ ప్రభుత్వ వ్యవసాయ శాఖ, భారతీయ పరిశ్రమల సమాఖ్య (సీఐఐ)లు సంయుక్తంగా కార్యక్రమాలు చేస్తున్నాయి. వ్యవసాయ అధికారులు, ఎన్జీ రంగా వ్యవసాయ శాస్త్రవేత్తలు, వివిధ కంపెనీల ప్రతినిధులు రైతులకు పలు సూచనలు, సలహాలు ఇచ్చి వ్యవసాయంలో అధిక దిగుబడులు సాధించేందుకు దిశానిర్దేశం చేశారు.చిరుధాన్యాలు, వాటి ఉత్పత్తులను వినియోగదారులకు అందుబాటులో ఉంచాలనే ఉద్దేశంతో గృహ విజ్ఞాన శాస్త్ర విభాగం, ఆచార్య ఎన్జీ రంగా యూనివర్సిటీ వారు ఇక్కడ ప్రాసెసింగ్ యూనిట్‌ను నెలకొల్పారు. వ్యవసాయ యాంత్రీకరణకు రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుందని అన్నారు.