ఆధ్యాత్మికత ముసుగులో అత్యాచారాలు
భారతస్త్రీలు ఎంతమంచి వారంటే తమకు జరిగిన అన్యాయాలను పంటిబిగువునే దాచుకుంటారు. ఎక్కడా బయటపడకుండా గుట్టుగా కాలం నెగ్గుకొస్తారు. పురాణ కాలం నుంచి కూడా మనకు ప్రాణదానం చేసి, జన్మనిచ్చిన స్త్రీని గౌరవంగా చూసిన దాఖలాలు తక్కువే. ఎంతసేపు ఆటవస్తువుగా, విలాసవస్తువుగా చూసి ఎంజాయ్ చేయడం అలవాటు చేసుకున్నారు. బరితెగించిన ఎందరో స్త్రీలను దోచుకోవడం వేరు. వారి మానాలను కొల్లగొట్టడం వేరు. కానీ ఆధ్యాత్మిక ముసుగులో పెద్దలుగా చెలామణి అవుతూ, ఆశ్రమాలు
నడుపుతున్న వారు తమను నమ్ముకుని వచ్చిన వారిని కామంతో చూస్తూ లోబర్చుకోవాలనుకోవడమే సహించరాని నేరం. వీరికి బజారు మనుషులకు పెద్ద తేడా లేదు. ఇలాంటి వారిని ఖండఖండాలుగా నరికి కాకుకలకు గద్దలకు వేయాలి. ఏళ్లతరబడి విచరన చేసి జైళ్లలో పెట్టించడం వల్ల్ లాభం లేదు. ఆ మధ్యన సచ్చసౌధా డేరా బాబా.. ఇప్పుడు ఆశారామ్ బాబాల చరిత్ర తీసుకుంటే వీరేమంత మంచి మనుషులు కారు. కేవలం కామాన్ని తీర్చుకునే పిశాచాలుగానే చూడాలి. ఆలస్యంగా అయినా కామాంధుడు ఆశారాం బాపునకు రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ ఎస్సీ, ఎస్టీ కేసుల ప్రత్యేక న్యాయస్థానం జీవిత ఖైదు విధించడం ద్వారా ఓ అబల చేఇన ప్రయత్నం ఫలించింది. మచ్‌ంచుకు కొన్ని కేసుల్లో మాత్రమే న్యాయం జరగుతోంది. ఎన్నో కేసులు డబ్బు మాటున బయటకు రాకుండా ఉంటున్నాయి. హైదరాబాద్‌లో నటి ప్రత్యూషను రేప్ చేసి చంపారు. దాని ఆనవాళ్లు లేకుండా డబ్బుకట్టల కింద కేసును నొక్కేసారు. ఫైల్ మూసేయించారు. అలాగే శ్రీరెడ్డి వ్యవహారం ఇంకా నిత్యం చర్చలోనే ఉంది. ఆమె వ్యవహాన్ని ఎన్నిరకాలుగా పక్కదారి పట్టించాలో పట్టిస్తున్నారు. ఇవన్‌ఈన కూడా ఉదాహరణల కోసం మాత్రమే ప్రస్తాఇంచాల్సి వస్తోంది.
కాశ్మీర్ కథువా, ఉత్తరప్రదేశ్ ఉన్నావొ అత్యాచార ఉదంతాలతో యావత్ దేశం ఆందోళన చెందుతున్న సమయాన ఐదేళ్లనాటి ఒక కేసులో ఆశారాం బాబాకు చచ్చే వరకు కారాగారవాసం విధింపు రేపిస్టులకు గుణపాఠం కావాలి. అలాగే ఇలాంటి తీర్పులు ఆహ్వానించదగిన పరిణామం. తమ పలుకుబడితో ఏ నేరమైనా చేసి తప్పించుకోవచ్చనుకునే దొగబాబాలకు, ఆశ్రమాలు నడిపే దగుల్బాజీలకు కోర్టు తీర్పు హెచ్చరిక కావాలి. ఇలాంటి దగుల్బాజీలు తప్పించుకోలేరని రుజువయ్యింది. ఆశ్రమం ముఉగులో కామకేళీ నడిపే వారికి శిక్షలు మరింత కఠినంగా రెట్టింపు చేయాలి. ఎందుకంటే వారు ఆధ్‌ఆయత్మిక ముసుగు వేసుకుని మోసం చేస్తున్‌ఆనరు కనుక వారికి అందరికన్నా ఎక్కువ మోతాదులో శిక్ష ఉండాలి. అప్పీలుకు తావు లేకుండా బహిరంగ ఉరికి అనుమతించాలి. అప్పుడే మహిళాలోకంలో ఆత్మవిశ్వాసం పెరుగుతంది. తమకు రక్షణ ఉందన్న భరోసా కలుగుతంది. ఆధ్యాత్మికత ముసుగు తొడుక్కొని అకృత్యాలకు పాల్పడు తున్న బాబాలకు స్వాములకు దేశంలో కొదవ లేదు. దొరకనంత వరకు దొరలుగా దొరికాక దొంగలుగా లోకానికి పరిచయం అయిన వారెందరో ఉన్నారు. డేరాబాబా, నిత్యానంద, ప్రేమానంద, వికాసానంద, అమృత చైతన్య, నారాయణ్‌సాయి ఇలా చెప్పుకుంటూ పోతే ఆశారాం సరసన చాలామంది చేరతారు. ఈ నేరస్త బాబాలు, స్వాములకు పరోక్షంగా, ప్రత్యక్షంగా కొమ్ముకాస్తున్నది రాజకీయ నాయకులు.. వారి అండదండలతో నడుస్తున్న ప్రభుత్వాలే. ఆశారాంనే తీసుకుంటే నాలుగు దశాబ్దాల్లో రూ.10 వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నాడు. దేశ విదేశాల్లో 400 ఆశ్రమాలు నెలకొల్పాడు. ఆశారాంపై అత్యాచారం కేసు నమోదయ్యాక సబర్మతి సవిూపంలోని ఆశ్రమంలో నిర్వహించిన సోదాల్లో నివ్వెరపర్చే విషయాలు వెల్లడయ్యాయి. భవనాలు, షేర్లు, వడ్డీ వ్యాపారం, ఆయుర్వేద ఉత్పత్తులు, ఆధ్యాత్మిక పుస్తకాల విక్రయాల ద్వారా రూ.వేల కోట్లు ఆర్జించాడని తేలింది. బాపుగా అవతారం ఎత్తకముందు జట్కా
బండి తోలుకొనే వ్యక్తి 1972లో సబర్మతి వద్ద ఒక గుడిసె లాంటి కుటీరంతో ఆధ్యాత్మిక చింతన ప్రారంభించి వేలకోట్లు సంపాదించడం వెనుక ప్రభుత్వాల అండదండలు ఉన్నాయని గుర్తించాలి. ఆశారామ్ కుమారుడు నారాయణ్‌సాయిపైనా లైంగిక వేధింపుల కేసులున్నాయి. అవతార పురుషునిగా ఆధ్యాత్మిక గురువుగా అనూహ్యంగా తెరవిూదికొచ్చిన ఆశారాం 2013 ఆగస్టు 15 రాత్రి జోధ్‌పూర్ సవిూపంలోని తన ఆశ్రమానికి పదహారేళ్ల మైనర్ బాలికను రప్పించుకొని అఘాయిత్యానికి పాల్పడ్డాడు. బాలిక ఫిర్యాదు మేరకు జోధ్‌పూర్ పోలీసులు ఆశారాంను అదే ఏడాది సెప్టెంబర్ 1న ఇండోర్‌లో అరెస్టు చేసి జోద్‌పూర్‌కు తరలించగా ఆ మరుసటి రోజు నుంచి కోర్టు ఆదేశాల మేరకు జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నాడు. అదే సంవత్సరం పలు సెక్షన్ల కింద పోలీసులు కోర్టులో ఛార్జిషీటు దాఖలు చేశారు. ఈ నెల 17 తుది వాదనలు విన్న కోర్టు ఆశారాంను మరో ఇద్దరిని దోషులుగా నిర్ధారించింది. ఆశారాంకు జీవితఖైదు, మరో ఇద్దరికి ఇరవై ఏళ్ల జైలు శిక్ష, జరిమానా విధిస్తూ జోధ్‌పూర్ కోర్టు తీర్పు వెలువరించింది. నిరుడు డేరా బాబాకు ఇలాగే అత్యాచార కేసులో కోర్టు శిక్ష విధించింది. ఇలాంటి తీర్పులతో వీరిని జైల్లకు పంపడం వల్ల లాభం ఉండదు. ఆశ్రమాలను,ఆస్తులను స్వాధీనం చేసుకోవడంతో పాటు వారిని వధ్యశిలపై నిలబెట్టి దేశమంతా తిప్పాలి. ఆ తరవాత కిరాతకంగా ఉరితీయాలి. అందరి రేపిస్టులకన్నా అధ్వాన్నంగా వీరిని చూడాలి. అయితే వేలకోట్ల ఆస్తులు, పలుకుబడి కారణంగా ఆశారం ఎన్నిరకాల ఒత్తిళ్లు చేయాలో అన్నీ చేశారు. అందుకే ఆయనకు అంత తేలిగ్గా ఏవిూ శిక్ష పడలేదు. ఎన్నో ఒత్తిళ్లను, బెదిరింపులను, దాడులను బాధిత బాలిక, ఆమె కుటుబం, సాక్షులు, దర్యాప్తు అధికారులు చవిచూశారు. ఏకంగా ముగ్గురు సాక్షులు హత్యకు గురయ్యారంటేనే ఆశారం చేయని ప్రయత్నం లేదని అర్థమవుతుంది. ఆశారం చేతుల్లో చెరచబడ్డ బాలిక బయటికొచ్చి పోలీసులకు ఫిర్యాదు చేసి చివరి వరకు ఎన్ని ఇబ్బందులొచ్చినా నిలబడింది. ఆమెను, ఆమెకు వెన్నంటి నిలిచిన కుటుంబాన్ని తొలుత అభినందించాలి. ముగ్గురు సాక్షులు హత్యకు గురయ్యాక కూడా ప్రధాన సాక్షిగా ఉన్న పాఠశాల ప్రిన్సిపాల్ మొక్కవోని దీక్షతో నిలబడటం మామూలు విషయం కాదు. ఆశారాంకు శిక్ష పడటానికి దర్యాప్తు బృందం చేసిన కృషిని మెచ్చుకోవాల్సిందే.