ఆన్‌లైన్ మోసంతో రెండున్నర లక్షలు కాజేత
రాజస్థాన్‌లో నిందితుడిని పట్టుకున్న పోలీసులు
విజయవాడ,జూలై22(జనంసాక్షి): ఆన్‌లైన్లో మోసాలకు పాల్పడుతూ బ్యాంక్ అకౌంటులో డబ్బులు కాజేస్తున్న రాజస్థాన్‌కు చెందిన జీవన్ కుమార్ అనే ఆన్ లైన్ మోసగాణ్ణి అరెస్టు చేసారు. అతని వద్ద రూ.1,80,000 నగదు రెండు సెల్ ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నట్లు నందిగామ పోలీసు తెలిపారు. ఈ సందర్భంగా ఎఎస్‌పి నాగేశ్వరరెడ్డి మాట్లాడుతూ అల్టాట్రెక్ సిమెంటు ఫ్యాక్టరీలో మేనేజర్‌గా పనిచేస్తున్న సంజరుకు గతేడాది డిసెంబర్ 4న అర్ధరాత్రి ఫోన్ చేసి అందమైన అమ్మాయిల ఫొటోలు పెట్టి వీరిని పంపుతానని కొంత మొత్తం అడ్వాన్స్ పంపాలని చెప్పాడు. అయితే తనకు ఫోన్ పే చేయమని చెప్పగా తనకు ఫోన్ పె లేదని కార్డు నెంబరు చెప్పమని కోరగా కార్డు నెంబరు చెప్పమన్నాడు. నిందితుడు జీవన్ కుమారు అతని కార్డు హాక్ చేసి ఒటిపి పంపి ఒటిపి ద్వారా మూడు దఫాలుగా రూ.2,45,000 లు డ్రా చేసుకున్నాడని సంజరు తాను మోసపోయానని తెలుసుకొని చిల్లకల్లు పోలీసులకు ఫిర్యాదు చేయగా జగ్గయ్యపేట సీఐ చిల్లకల్లు ఎస్.ఐ చిన్నబాబు,వారి టీమ్ చాకచక్యంగా అతడిని రాజస్థాన్‌కు వెళ్లి అరెస్టు చేశారని ఏసీపీ తెలిపారు. ఈ సందర్భంగా చిన్నబాబు వారి టీమ్‌ను ఎఎస్‌పి అభినందించి వారకి రివార్డు అందజేశారు.