ఆప్ సర్కారు తొలి బడ్జెట్
ఢిల్లీ జూన్25(జనంసాక్షి): ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం తొలి బడ్జెట్ ను అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. 2015-16 ఆర్థిక సంవత్సరానికి గాను రూ. 41,129 కోట్లతో ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా బడ్జెట్ ను ప్రతిపాదించారు. ప్రణాళికా వ్యయం రూ. 19,000 కోట్లు, ప్రణాళికేతర వ్యయం రూ. 22,129 కోట్లుగా చూపించారు. మొత్తం బడ్జెట్ లో విద్యకు దాదాపు పావు శాతం అంటే.. రూ. 9,836 కోట్లు కేటాయించారు. స్వరాజ్ ఫండ్ కు రూ. 253 కోట్లు ప్రకటించారు. దేశంలో తొలిసారిగా స్వరాజ్ బడ్జెట్ ను ప్రవేశపెట్టామని సిసోడియా పేర్కొన్నారు.