ఆఫీసుకు రావద్దన్నారు
– ఢిల్లీ మహిళ కమీషనర్ ఆవేదన
హైదరాబాద్ జులై23(జనంసాక్షి):
తనను కార్యాలయానికి రావద్దని లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్‌జంగ్ చెప్పారని దిల్లీ మహిళా కమిషన్ ా’య్రర్ పర్సన్ స్వాతి మలివాల్ అన్నారు. ఈమెను దిల్లీ మహిళా కమిషన్ ా’య్రర్ పర్సన్‌గా దిల్లీ ప్రభుత్వం నాలుగు రోజుల క్రితం నియమించింది. అయితే లెఫ్టినెంట్ గవర్నర్ ఆమె నియామకాన్ని రద్దు చేశారు. దిల్లీ మహిళా కమిషన్ ా’య్రర్‌పర్సన్‌గా స్వాతి నియామకం చెల్లదని గవర్నర్ దిల్లీ ప్రభుత్వానికి లేఖ రాశారు.
అయితే దీనిపై స్వాతి తీవ్రస్థాయిలో స్పందించారు. తన కార్యాలయం మూసేసి ఉంటుందని, తనను గురువారం నుంచి కార్యాలయానికి రావద్దని లెఫ్టినెంట్ గవర్నర్ తనకు ఫోనులో చెప్పారని స్వాతి ట్విట్టర్‌లో పేర్కొన్నారు. కార్యాలయ సిబ్బంది కూడా ఎవరూ తనతో మాట్లాడకూడదని సూచించారని ఆమె పేర్కొన్నారు.
స్వాతి మలివాల్ ఆమ్ ఆద్మీ పార్టీ నేత నవీన్ జైహింద్ భార్య. ఆమెను దిల్లీ ప్రభుత్వం నాలుగు రోజుల క్రితం మహిళా కమిషన్ ా’య్రర్‌పర్సన్‌గా నియమించింది. సోమవారం ఆమె బాధ్యతలు స్వీకరించారు.