ఆఫ్ఘనిస్తాన్ అధికారుల ఎదుట లొంగిపోయిన ఉగ్రవాదులు
కాబూల్(జనం సాక్షి ): బాడ్ఘిస్ ప్రావిన్స్‌లో ఆదివారం 50 ఉగ్రవాదులు ఆఫ్ఘనిస్తాన్ అధికారుల ఎదుట లొంగియారు. ఈ విషయాన్ని స్థానిక పోలీసు అధికారులు ధృవీకరించారు. లొంగిపోయిన వారిలో తాలిబన్ కీలక కమాండర్ ముల్లా తూపాన్ కూడా ఉన్నారు. కొన్ని సంవత్సరాల నుంచి ముల్లా తూపాన్ సుమారు 300 మంది ఉగ్రవాదులను పెంచిపోషించాడు. ముల్లా తూపాన్ లొంగుబాటు బాడ్ఘిస్ ప్రావిన్స్‌తో పాటు పక్కనున్న ప్రాంతాల్లో కూడా తాలిబన్‌కు కోలుకోని దెబ్బ అని అధికారులు చెబుతున్నారు. ఆయుధాలను కూడా పోలీసులకు అప్పగించారు.