ఆరు గ్యారెంటీల అమలు బాధ్యత నాదే..
` తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ తుఫాను రాబోతుంది
` కారు టైర్లు పంచరవుతున్నాయి
` దొరల తెలంగాణ వద్దు ప్రజల తెలంగాణ కావాలి
` రాష్ట్రంలో రాబోయేది కాంగ్రెస్ ఆధ్వర్యంలోని ప్రజల సర్కారే
` కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థులను గెలిపించండి
` ప్రత్యేకరాష్ట్రం ఇస్తే కెసిఆర్ కుటుంబమే బాగుపడిరది
` బీజెపి, బీఆర్‌ఎస్‌లు రెండూ ఒక్కటే
` ప్రజా తెలంగాణ ఆకాంక్ష కాంగ్రెస్ పార్టీ లక్ష్యం
` ఎన్నికల ప్రచారం సభల్లో రాహుల్
బోధన్,వేములవాడ,ఆదిలాబాద్:(జనంసాక్షి) తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ తుఫాన్ రాబోతుందని అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు ధీమా వ్యక్తం చేశారు.వేములవాడ పట్టణంలో ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచార బహిరంగ సభలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తుఫాన్ రాబోతుందని బిజెపి, బిఆర్‌ఎస్ పార్టీలను గద్దె దించడమే కాంగ్రెస్ లక్ష్యమని బీఆర్‌ఎస్,బిజెపి పై విరుచుకుపడ్డారు. బీఆర్‌ఎస్ సర్కారు ప్రజల కళలను నాశనం చేసిందని, విద్యార్థుల భవిష్యత్తును పక్కనపెట్టి కుటుంబ భవిష్యత్తును చూసుకుందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే ఆరు గ్యారెంటీలను తప్పకుండా అమలు చేస్తామన్నారు. మహాలక్ష్మి, రైతు భరోసా,గృహజ్యోతి, ఇందిరమ్మ ఇల్లు, ఆరోగ్య వికాసం, ఆరు గ్యారెంటీలను ప్రభుత్వం ఏర్పడినాక తొలి క్యాబినెట్ లోనే ప్రవేశపెడతామన్నారు . తెలంగాణ ప్రజల ఆకాంక్షలను దృష్టిలో ఉంచుకుని మేనిఫెస్టో విడుదల చేశామన్నారు. పదేళ్లుగా కేసీఆర్ ప్రభుత్వం చేసిన అవినీతి డబ్బులను బయటకు తీసి ప్రజలకు పంచుతామన్నారు, నరేంద్ర మోదీ, కేసీఆర్ ఇద్దరూ ఒకటేనని విమర్శించారు. నరేంద్ర మోడీని కలలో కూడా వదలననీ తెలంగాణ ప్రభుత్వ అవినీతిలో ఇద్దరూ భాగస్వాములనే అన్నారు. మోదీ ప్రభుత్వం తన ఎంపీ సభ్యత్వాన్ని కూడా రద్దు చేసిందని, నా ఇంటిని కూడా ఖాళీ చేసేందుకు పూనుకుందని మండిపడ్డారు. దేశ సంపదను ప్రధాని మోదీ తన స్నేహితులకు దోచిపెడుతున్నారని ఆరోపించారు.ప్రజల సంక్షేమాన్ని విస్మరించిన బీఆర్‌ఎస్ ప్రభుత్వానికి ఓటుతో బుద్ధి చెప్పాలని రాహుల్ గాంధీ ప్రజలకు పిలుపునిచ్చారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత యువతకు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక జాబ్ క్యాలెండర్ ప్రకారం ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు. రాష్ట్రంలో పేదలకు హావిూ ప్రకారం ఇల్లు కట్టించలేదని, కాళేశ్వరం ప్రాజెక్టులో, మిషన్ భగీరథలో కుంభకోణాలు జరిగాయని ఆరోపించారు. ధరణి పోర్టల్ ద్వారా రైతుల భూముల దోపిడీకి గురవుతున్నాయని, దేశంలోనే ఎక్కువ నిరుద్యోగం తెలంగాణలో ఉందన్నారు. విద్యార్థుల ఆత్మహత్యలు జరుగుతున్నాయని.. ఇంత జరుగుతున్న బీఆర్‌ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందని అన్నారు. కాంగ్రెస్ ముఖ్య ఉద్దేశం దేశంలో బిజెపి, రాష్ట్రంలో టిఆర్‌ఎస్ ను గద్దదించడమే లక్ష్యమని అన్నారు.కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రెండు లక్షల రూపాయల రుణమాఫీ 24 గంటల్లోపు చేస్తామన్నారు. వేములవాడ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆది శ్రీనివాస్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు
దొరల సర్కారును సాగనంపండి
బోధన్:ప్రజల సర్కారు రావాలంటే దొరల సర్కారును సాగనంపాలని రాహుల్ గాంధీ బోధన్ నియోజకవర్గ ప్రజలకు పిలుపునిచ్చారు. శనివారం బోధన్ పట్టణ శివారులో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు రాహుల్ గాంధీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈసారి దొరల సర్కార్కు ప్రజల సర్కార్కు మధ్య యుద్ధం జరుగుతుందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రజల, రైతుల, మహిళల ప్రభుత్వం ఏర్పాటు అవుతుందనుకున్న తెలంగాణ ప్రజలకు నిరాశే మిగిలిందన్నారు. కెసిఆర్ సర్కారు వచ్చిన తర్వాత కుటుంబ పాలనగా రాష్ట్రం ఏర్పడిరదన్నారు. కాలేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో తెలంగాణ ప్రజలకు చెందిన లక్ష కోట్ల రూపాయలను ముఖ్యమంత్రి కేసీఆర్ దోచుకున్నాడని ఆయన ఆరోపించారు. కాలేశ్వరం ప్రాజెక్ట్ ను సందర్శించగా ప్రాజెక్టుకు పగుళ్లు ఏర్పడ్డాయని ఆయన అన్నారు. కాంగ్రెస్ సర్కార్ హయాంలో ప్రజలకు భూములను పంచడంతోపాటు వారి హక్కుల సాధనకు కృషి చేయడం జరిగిందన్నారు. కెసిఆర్ ధరణి పేరుతో భూముల కంప్యూటరీకరణ అంటూ తెలంగాణ ప్రజల భూములను లాక్కున్నారని, ముఖ్యమైన శాఖలు కేసీఆర్ కుటుంబ పరిధిలోనే ఉన్నాయన్నారు. ధరణి పోర్టల్ తో 30 లక్షల మంది రైతులు తమ భూములను కోల్పోవాల్సి వచ్చిందన్నారు. కెసిఆర్ మంత్రులు ఎమ్మెల్యేలకు నచ్చిన భూములను ధరణి పేరుతో ప్రభుత్వ భూములను లాక్కున్నారన్నారు. మరోసారి తెలంగాణ సర్కారు ఏర్పాటు అయితే ప్రజల భూములను లాక్కుంటారన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కాంగ్రెస్ సర్కారు ఏమి చేసిందని ప్రశ్నిస్తున్నారని, అయితే కేసీఆర్ చదువుకున్న పాఠశాల, యూనివర్సిటీ కాంగ్రెస్ సర్కారు ఏర్పాటు చేసిందన్నారు. హైదరాబాదులో ఐటి సిటీ, మెట్రో రైలు, ఔటర్ రింగ్ రోడ్డు వంటి పనులను చేపట్టిన ఘనత కాంగ్రెస్ సర్కారుకే దక్కుతుందన్నారు. గత పది సంవత్సరాల నుండి ప్రజలు దొరల సర్కారును చూస్తున్నారని అయితే రాబోయే పది సంవత్సరాలు ప్రజల సర్కారును చూస్తారని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన 6 సంక్షేమ పథకాలను సర్కారు వచ్చిన వెంటనే అమలు చేస్తుందని, ఈ మేరకు బోధన్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సుదర్శన్ రెడ్డిని చేతి గుర్తుకే ఓటు వేసి గెలిపించాలని రాహుల్ గాంధీ కోరారు. ఈ కార్యక్రమంలో మాజీమంత్రి సుదర్శన్ రెడ్డి, మండవ వెంకటేశ్వరరావు, బోధన్ మున్సిపల్ చైర్మన్ తూము పద్మ, శరత్ రెడ్డి, డిసిసి జిల్లా అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి, మాజీ అధ్యక్షులు తాహెర్ బిన్ హందాన్, బోధన్ మండల మాజీ జడ్పిటిసి అల్లె లావణ్య, టిపిసిసి డెలిగేట్ గంగాశంకర్, జిల్లా కాంగ్రెస్ నాయకులు బిల్లా రామ్మోహన్ అల్లె రమేష్, పులి శ్రీనివాసరావు కరటూరి సత్యనారాయణ, లింగం, తలారి నవీన్, షేక్ పరాన్, కాంగ్రెస్ పార్టీ ప్రముఖులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
దొరలతెలంగాణకు ప్రజల తెలంగాణకు మధ్య పోరు
ఆదిలాబాద్:బిఆర్‌ఎస్, బిజెపిలు ఒక్కటేనని, అధికారం కోసం ఈ రెండు పార్టీలు కలసి పనిచేస్తున్నాయని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అనతరం జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ తెలంగాణలో ఒక్క కుటుంబం మాత్రమే బాగుపడిరదన్నారు. ప్రజా తెలంగాణ రావాలనే తన ఆకాంక్షన్నారు. దొరల తెలంగాణలో అన్నదాతలు ఆత్మహత్య చేసుకున్నారంటూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఉద్యమ కారులకు 200 గజాల ఇంటి స్థలాన్ని ఇస్తామన్నారు. ఆరు గ్యారంటీలను మొదటి కేబినెట్ సమావేశంలోనే అమలు చేశారు. తెలంగాణలో కేసీఆర్, ఢల్లీిలో నరేంద్ర మోదీ ఒక్కటేనన్నారు. నరేంద్ర మోదీకి కేసీఆర్, ఎంఐఎం పార్టీ ఇద్దరూ స్నేహితులేనన్నారు. ప్రజా తెలంగాణ రావాలనేదే తన ఆకాంక్ష అని ఆదిలాబాద్? సభలో రాహుల్ గాంధీ అన్నారు. సీఎం కేసీఆర్ తెలంగాణ ప్రజల కలలను నాశనం చేశారన్నారు. తొమ్మిదేళ్లలో తెలంగాణలో అవినీతి జరిగిందన్నారు. ప్రజా తెలంగాణలో మహలక్ష్మీ పథకాన్ని అమలు చేస్తూ ప్రతి మహిళ ఖాతాలో రూ. 2,500 జమచేసి వంట గ్యాస్? ను రూ, 500 లకే అందిస్తామన్నారు. రూ. 4 వేలు వృద్దులకు, వితంతువులకు, దివ్యాంగులకు ఇస్తామన్నారు. రాజీవ్? ఆరోగ్యశ్రీ పథకం ద్వారా రూ. 10 లక్షలు ఆరోగ్య బీమా సౌకర్యాన్ని అందజేస్తామన్నారు. తెలంగాణలో ఇక బిఆర్‌ఎస్ అవినీతి పాలన అంతం కాబోతున్నదని, బిజెపి, బిఆర్‌ఎస్ రెండూ తెలంగాణ ద్రోహ పార్టీలని అన్నారు. బోధన్‌లో ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ బీజేపీ, బీఆర్‌ఎస్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. బీజేపీ ప్రభుత్వం,నరేంద్ర మోడీ నల్లచట్టాలు చేసి రైతులను మోసం చేస్తున్నారన్నారు. నా పార్లమెంటు సభ్యత్వం రద్దు చేశారు.. నాకు ప్రభుత్వ ఇంటిని తొలగించారని అన్నారు. నరేంద్ర మోడీ ప్రభుత్వానికి కేసీఆర్ అన్ని విధాలుగా సహకరిస్తున్నారని.. అక్కడ మోడీ.. ఇక్కడ కేసీఆర్ ఒకటే అని వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కేసీఆర్ కారు పంచర్ అయ్యిందన్నారు. రాష్ట్రంలో దొరల పాలన కొనసాగుతోందని తెలిపారు. కాళేశ్వరం పేరుతో పెద్ద కుంభకోణం చేశారని మండిపడ్డారు. ధరణి పోర్టల్‌తో ఎమ్మెల్యేకు భూములు అప్పగిస్తున్నారని రాహుల్ ఆరోపించారు. దొరలకు, ప్రజలకు మధ్య యుద్ధం జరుగుతోందన్నారు. కాళేశ్వరంలో లక్ష కోట్ల కుంభకోణం జరిగిందన్నారు. పేదల కోసం కాంగ్రెస్ పోరాడుతుందని స్పష్టం చేశారు. మళ్ళీ అధకారంలోకి వేస్తే భూములు గుంజుకుంటారని విమర్శించారు. కేసీఆర్ చదువుకున్న పాఠశాల కాంగ్రెస్ పార్టీ కట్టిందే అని తెలిపారు. హైదరాబాద్ నగరాన్ని ఐటీ సిటీ చేసింది కాంగ్రెస్ అని.. మెట్రో కాంగ్రెస్ హయంలోనే వచ్చిందని చెప్పుకొచ్చారు. కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్న మంత్రులు దోపిడీదారులన్నారు. లిక్కర్ మాఫియా, భూదందా కేసీఆర్ కుటుంబంలో ఉందని దుయ్యబట్టారు. దళితబంధు, ఎస్సీ, ఎస్టీ సబ్ ఎª`లాన్ దారి మళ్లించారని ఆరోపించారు. వచ్చేది ప్రజల ప్రభుత్వమే అని స్పష్టం చేశారు. మొదటి క్యాబినెట్
విూటింగ్‌లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని హావిూ ఇచ్చారు. బీజేపీ ఏ బిల్లు పెట్టినా కేసీఆర్ మద్దుతు ఇచ్చారన్నారు. మూడు బిల్లులను తాను కళ్ళారా చూసినట్లు తెలిపారు. తెలంగణ తన సొంత ఇల్లు అని పేర్కొన్నారు. కేసీఆర్ విూద ఒక్క కేసు పెట్టలేదని.. కేసీఆర్‌కు బీజేపీ, కేంద్ర ప్రభుత్వం సహకరిస్తోందని ఆరోపించారు. కేసీఆర్, బీజేపీని తరిమికొట్టాలని.. కేంద్రంలో బీజేపీని, మోడీని ఓడిరచాలని పిలుపు నిచ్చారు. కేసీఆర్ తెలంగాణలో, మోడీ ఢల్లీిలో రాజ్యమేలుతున్నారని అన్నారు. కారు టైరులు కాంగ్రెస్ పంచర్ చేసిందని.. బీఆర్‌ఎస్ గాలి తీశారని.. ఢల్లీికి వెళ్లి మోడీని పంచరు చేస్తానని స్పష్టం చేశారు. ప్రజల తెలంగాణ తెచ్చుకుందామని రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు.