ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దాం
– ప్రభుత్వం, ప్రైవేట్ ఆసుపత్రులు కలిసి పనిచేస్తే అద్భుత ఫలితాలు
– కంటిపరీక్షల కార్యక్రమంపై ప్రజల అవగాహన కల్పించాలి
– వైద్యుల సమావేశంలో ఎంపీ కవిత
నిజామాబాద్, మే17(జనం సాక్షి ) : ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామని, అందుకు వైద్యులు సహకరించాలని ఎంపీ కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు. గురువారం నిజామాబాద్ లో ఐఎంఎ, తెలంగాణ నర్సింగ్ ¬మ్స్ అసోసియేషన్, భారతీయ ఫిజీషియన్ల సంఘం నేతలతో ఎంపి కవిత సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ కవిత మాట్లాడుతూ వైద్య వృత్తి పవిత్రమైనదన్నారు. పేషంట్లు కనిపించే దేవుళ్ళుగా భావిస్తారని.. వారి నమ్మకాన్ని మరింత పెంచాలని సూచించారు. ప్రభుత్వం, ప్రయివేటు ఆసుపత్రులు కలిసి పని చేస్తే అద్భుత ఫలితాలు వస్తాయన్నారు. సీఎం కేసీఆర్ వైద్య, ఆరోగ్య రంగం అభివృద్ధికి చేస్తున్న కృషి విూకందరికీ తెలుసు. ఆహారపుటలవాట్లు ప్రధానంగా రోగాలకు కారణం అవుతున్నాయి. ఉప్పు వాడకం అత్యధికంగా ఉన్న విషయాన్ని సీఎం కేసీఆర్ చెప్పారని, ఇలాంటి విషయాలను డాక్టర్లుగా పేషంట్లు, వారి కుటుంబ సభ్యులకు తెలియజెప్పాలని ఎంపీ కవిత కోరారు. మిషన్ భగీరథ పూర్తయితే కలుషిత నీటిని తాగడం వల్ల వచ్చే అంటురోగాలు తగ్గిపోతాయని ఎంపీ కవిత వివరించారు. కంటి పరీక్షలు కార్యక్రమం పై ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు. నిజామాబాద్ నగరంలో రోడ్ల సమస్యలు త్వరలో తొలగిపోతాయని తెలిపారు. 24 గంటల కరెంటు సరఫరా కోసం సీఎం కేసీఆర్ ఇంజనీర్ గా మారి, పక్కా ప్లానింగ్, పర్యవేక్షణ వల్ల ఇది సాధ్యమైందన్నారు. తెలంగాణ వ్యవసాయానికి వరప్రసాదిని కాళేశ్వరం ప్రాజెక్ట్ స్థలాన్ని సందర్శించాలని డాక్టర్లను ఎంపీ కవిత కోరారు. ఈ సమావేశంలో నిజామాబాద్ అర్భన్ ఎమ్మెల్యే భిగాల గణెళిశ్ గుప్తా, మేయర్ ఆకుల సుజాత, టీఎస్ రెడ్ కో చైర్మన్ ఎస్.ఎ అలీం, తెలంగాణ మెడికల్ కౌన్సిల్ చైర్మన్ రవీందర్ రెడ్డి, ఐఎంఎ నిజామాబాద్ అధ్యక్షులు డాక్టర్ కౌలయ్య, కార్యదర్శి డాక్టర్ భూమ్ రెడ్డి, తెలంగాణ నర్సింగ్ ¬మ్స్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ సురేష్ కుమార్, కార్యదర్శి డాక్టర్ శివకుమార్, ఫిజీషియన్ల సంఘం నేతలు డాక్టర్ బా పురెడ్డి, డాక్టర్ తిరుపతి రావు పాల్గొన్నారు.