ఆరోగ్య తెలంగాణనే ముఖ్యమంత్రి కేసీఆర్ గారి లక్ష్యం..

 

 

 

 

 

పల్లె దవాఖానల ద్వారా ప్రజల సుస్తీని పోగొట్టి,దోస్తీ దవాఖానగా మారనున్నాయి

నాగర్ కర్నూల్ రూరల్ సెప్టెంబర్ 02(జనంసాక్షి)

పల్లె దవాఖాన ప్రారంభించిన ఎమ్మెల్యే మర్రి.జనార్దన్ రెడ్డి,జడ్పి ఛైర్మన్ పద్మావతీ,ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి నిన్న నాగర్ కర్నూల్ మండలంలోని తూడుకుర్తి గ్రామంలో 16లక్షల రూపాయలతో నిర్మించిన పల్లె దవాఖానను ప్రారంభించిన ఎమ్మెల్యే మర్రి.జనార్దన్ రెడ్డి,జడ్పి ఛైర్మన్ పద్మావతీ,ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి,ఈ సదర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ,పల్లె దవాఖానల ద్వారా మంచి వైద్యం అందించాలని ఇప్పటివరకు ఏర్పాటు చేసిన పల్లె దవాఖానలు ప్రజల సుస్తీని పోగొట్టి,దోస్తీ దవాఖానగా మారాయి.ప్రభుత్వ ఆసుపత్రులు ఒకప్పటి లాగా లేవు,పూర్తిగా మారిపోయాయి.అభివృద్ధి చెందిన అన్ని దేశాల్లో సాధారణ ప్రసవాలు ఎక్కువగా ఉంటాయి.మన వద్ద సి సెక్షన్లు ఎక్కువ జరుగుతున్నాయి.పైసా ఖర్చు లేకుండా వైద్యం,పరీక్షలు,మందులు అందుతున్నాయి.ప్రభుత్వ ఆసుపత్రుల్లో డెలివరీ అయితే కేసీఆర్ కిట్ ఇచ్చి,అమ్మ ఒడి వాహన సేవలు అందించి,13వేల రూపాయలు ఇస్తున్నాం.పేదలు ప్రభుత్వ ఆసుపత్రులకు రావాలి.ఉచిత వైద్యాన్ని పొందాలి అని అన్నారు.ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు మరియు టిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.