తుపాకీతో కాల్చుకొని ఏఆర్ కానిస్టేబుల్ ఆత్మహత్య..రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ లో ఘటన
రంగారెడ్డి జిల్లా ప్రతినిథి సెప్టెంబర్ 28 (జనంసాక్షి) : రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ భవనంలో విధులు నిర్వహిస్తున్న ఓ ఏఆర్ కానిస్టేబుల్ తుపాకీతో తనను తాను కాల్చుకొని బలవన్మరణానికి పాల్పడ్డారు. మృతుడిని మంచాల గ్రామానికి చెందిన దూసరి బాలకృష్ణగా గుర్తించారు. రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఏఆర్ కానిస్టేబుల్ గా పని చేసిన అతను ఇటీవలే రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ కు బదిలీ అయ్యి అక్కడ విధులు నిర్వహిస్తున్నట్టు అధికారులు తెలిపారు.అయితే, శనివారం తెల్లవారుజామున 03:30 గంటల ప్రాంతంలో విధుల్లో ఉండగానే తన తుపాకితో తానే కాల్చుకొని బాలకృష్ణ ఆత్మహత్యకు పాల్పడ్డట్టు అధికారులు పేర్కొన్నారు. ఘటన సమయంలో అక్కడ ఎవరూ లేరని వెల్లడించారు.