ఆరో వికెట్ కోల్పోయిన ఇంగ్లాండ్

india-england-test-matchభారత్‌తో జరుగుతున్న రెండో టెస్టులో ఇంగ్లాండ్ ఆరో వికెట్ కోల్పోయింది. 53 పరుగులు చేసిన బెయిర్ స్టోను ఉమేష్ పెవిలియన్‌కు పంపాడు. ఓవర్ నైట్ స్కోరు 103/5తో మూడో రోజు బ్యాటింగ్ కొనసాగించిన ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్స్ స్టోక్స్, బెయిర్‌స్టో నిలకడగా ఆడారు. ఈ క్రమంలోనే వీరిద్దరూ హాఫ్ సెంచరీలను పూర్తి చేసుకున్నారు. స్టోక్స్-బెయిర్‌స్టో జోడీ 110 పరుగులు సాధించారు. వీరి భాగస్వామ్యాన్ని విడదీయడానికి కోహ్లీ బౌలర్లను మార్చినా ఫలితం లేకుండా పోయింది. ఆఖరికి ఇన్నిగ్స్ 79 ఓవర్‌లో ఉమేష్ బెయిర్‌స్టోని క్లీన్ బౌల్డ్ చేయడంతో వీరి భాగస్వామ్యానికి తెరపడింది. లంచ్ విరామ సమయానికి ఇంగ్లాండ్ 81 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది. స్టోక్స్ 55, రషీద్ 1 పరుగుతో క్రీజ్‌లో ఉన్నారు.