ఆర్టిఐ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పండ్లు పంపిణీ

-జిల్లా అధ్యక్షులు బానోత్ రమేష్ నాయక్

మహబూబాబాద్ బ్యూరో-అక్టోబర్16 (జనంసాక్షి)

సమాచార హక్కు రక్షణ చట్టం-2005 అక్టోబర్ 16 వరకు 4 సంవత్సరాలు పూర్తి చేసుకుని 5వ సంవత్సరంలో అడుగు పెట్టిన సందర్భంగా కార్యకర్తలు అందరూ కలిసి మానుకోట జిల్లా కేంద్రంలోని దైవ కృప అనాధ ఆశ్రమంలో కేక్ కట్ చేసి పండ్లు పంపిణీ చేశారు. అనంతరం ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మానుకోట జిల్లా అధ్యక్షుడు బానోతు రమేష్ నాయక్ మాట్లాడుతూ ఈ సంస్థ ఏర్పాటు చేసిన అప్పటి నుండి ఇప్పటివరకూ ఎన్నో సేవా కార్యక్రమాలు తో పాటు ప్రభుత్వ అధికారుల అవినీతిని బయటికి తీసి వారి పై చర్యలు తీసుకునే విధంగా చేయడం జరిగిందన్నారు.అదేవిధంగా
జిల్లా,రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న ఆర్టిఐ ధరఖాస్తులను తొందరగా పరిష్కరించాలని, ప్రతి ప్రభుత్వ ఆఫీస్ లో సెక్షన్ 4(1)బి ని అమలు చెయ్యాలని డిమాండ్ చేసారు. ప్రజలందరూ చట్టాలపై అవగాహన పెంచుకోవాలని తెలిపారు. చట్టం అనేది ఉన్నవారికి చుట్టం కాదని, ప్రతి సామాన్యుడికి అన్ని హక్కులు కల్పించబడ్డాయని తెలిపారు. సమాచార హక్కు చట్టం సామాన్యునికి వజ్రాయుధం దీనిని ప్రజలు చక్కగా ఉపయోగించుకోవాలి అని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రసాద్ నాయక్, మాజీ కౌన్సిలర్ లక్ష్మి, ఏఎన్ఎం పార్వతి, దేవి, మంగ్యా నాయక్, సంతోష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు