ఆర్టీఏ అధికారి లంచగొండి..

12హైదరాబాద్ : ప్రజా ధనాన్ని వేతనంగా పొందుతూ ప్రజల కోసం పనిచేయాల్సిన ప్రభుత్వ అధికారులు..ఉద్యోగుల్లో కొందరు విద్యుక్త ధర్మాన్ని విడనాడి లంచాలు ఆశిస్తున్నారు. బాధ్యతగా పనిచేయాల్సిన ప్రభుత్వ అధికారుల్లో కొంతమంది మానవత్వం లేకుండా ప్రజలను లంచాల కోసం పీడిస్తున్నారు. సమాచారం అందుకున్న ఏసీబీ అధికారులు వీరిపై దాడులు చేస్తూ కటకటాల్లోకి నెడుతున్నారు. అయినా లంచావతారాలు పట్టుపడుతూనే ఉన్నారు. తాజాగా నగరంలోని ఆర్టీఏ అధికారి నరేందర్ ఇంటిపై ఏసీబీ దాడులు చేసింది. గురువారం ఉదయమే బోయిగూడలోని నరేందర్ ఇంటిపై తనిఖీలు చేపట్టింది. సుమారు ఐదు కోట్ల రూపాయల అక్రమాస్తులున్నట్లు తెలుస్తోంది. గాంధీనగర్, పీల్ ఖానాతో పాటు ఐదు చోట్ల ఏసీబీ సోదాలు నిర్వహించింది. నరేష్ బంధువుల ఇళ్లలోనూ తనిఖీలు కొనసాగుతున్నాయి. నెల రోజుల క్రితం రూ.8వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన నరేందర్ సస్పెన్షన్ లో ఉన్నారు. నరేందర్ కు సంబంధించి నగరంలోని నాలుగు ప్రాంతాల్లో సోదాలు జరుగుతున్నాయని ఏసీబీ డీఎస్పీ పేర్కొన్నారు. ఇప్పటి వరకు రూ.22 లక్షల నగదు, 60 తులాల బంగారం, మూడు ప్రాంతాల్లో ప్లాట్లు గుర్తించినట్లు తెలిపారు.

తాజావార్తలు