ఆర్టీసీ బస్సు, ఆటో ఢీ… ఇద్దరు మృతి
విజయవాడ, జూలై 31 : గుడ్లవల్లేరు మండలం కౌతారం వద్ద మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. కిక్కిరిసిన ప్రయాణికులతో వెళ్తున్న ఆటోను ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మృతి చెందారు. ఆటో ప్రయాణికులు మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారిని వెంటనే గుడివాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆర్టీసీ బస్సు డ్రైవర్ పోలీసులకు లొంగిపోయాడు.