ఆర్టీసీ యాజమాన్యంతో చర్చలు విఫలం

 

5

 

5A– ఆంధ్రా ఎండీతో చర్చలు జరపం

– తెలంగాణ కార్మిక సంఘం

– బోర్డుపదవికి పద్మాకర్‌ రాజీనామా

హైదరాబాద్‌,మే8(జనంసాక్షి): ఆర్టీసీ యాజమాన్యంతో కార్మిక సంఘాలు జరిపిన చర్చలు విఫలమమయ్యాయి. బస్‌భవన్‌లో ఆర్టీసీ ఎండీ సాంబశివరావుతో జరిపిన ఈ చర్చల్లో ఈయూ, టీఎంయూ నేతలు పాల్గొన్నారు. చర్చల్లో ఎలాంటి పురోగతి లేకపోగా బోర్డు సభ్యత్వానికి పద్మాకర్‌ రాజీనామా చేశారు. ఇక బస్‌భవన్‌లో కార్మిక సంఘాల నేతల తీరుతో చర్చలు జరుగుతుండగా ఆర్టీసీ ఎండీ మధ్యలోనే వెళ్లిపోయారు. దీంతో  చర్చలు అర్ధాంతరంగా ముగిశాయి. కార్మిక సంఘాల నేతలతో జరిపిన చర్చలు విఫలమయ్యాయి. సమావేశంలో ఆర్టీసీ ఎండీ సాంబశివరావు, కార్మిక సంఘాల నేతల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకున్నట్లు సమాచారం. సమావేశం జరుగుతుండగానే ఎండీ బయటకు వెళ్లినట్లు తెలుస్తోంది. సమ్మెను అణిచివేసే దిశగా ఎండీ వ్యవహరిస్తున్నారని కార్మిక సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.    ఆంధ్ర ఎండీతో తాము చర్చలు జరిపే ప్రశస్తేలేదని టీఎంయూ నేతలు స్పష్టం చేశారు.   ఆర్టీసీ కార్మికులకు 43 శాతం ఫిట్‌మెంట్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ కార్మికులు సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే. కార్మికుల సమ్మెను అణచివేసేలా ఆర్టీసీ ఎండీ వ్యవహరిస్తున్నారని ఆర్టీసీ కార్మిక సంఘాలు ఆరోపించాయి. సాయంత్రం జరిగిన చర్చల సందర్భంగా ఎండీ, కార్మిక సంఘాల మధ్య వాగ్వాదం జరిగినట్లు సమాచారం. చర్చలు విఫలమైన అనంతరం కార్మిక సంఘాల నేతలు విూడియాతో మాట్లాడుతూ… ఎండీ నియంతృత్వ ధోరణిని వీడితేనే చర్చలు సఫలమవుతాయన్నారు. ఆయన తన ¬దాకు తగ్గట్లుగా వ్యవహరించడలేదని విమర్శించారు. ఎండీ వ్యవహారంపై ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తామని చెప్పారు. చిత్తూరులో కార్మికులపై పోలీసుల లాఠీఛార్జీని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని కార్మిక సంఘాల నేతలు తెలిపారు. సమ్మె సందర్భంగా కార్మికులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని డిమాండ్‌ చేశారు.  కార్మికుల సమ్మెను అణచివేసేలా ఆర్టీసీ ఎండీ వ్యవహరిస్తున్నారని ఆర్టీసీ కార్మిక సంఘాలు ఆరోపించాయి.  సమ్మె చేస్తున్న కార్మికులపై లాఠీఛార్జి చేయడాన్ని ఆయన తీవ్రంగా విమర్శించారు. దీనికి నిరసనగా ఆర్టీసీ బోర్డు డైరెక్టర్‌ పదవికి రాజీనామా చేస్తున్నట్లు పద్మాకర్‌ ప్రకటించారు. అంతకుముందు హైదరాబాద్‌  నగరంలోని బాగ్‌లింగంపల్లిలో ఉన్న సుందరయ్య విజ్ఞానకేంద్రంలో ఆర్టీసీ కార్మిక సంఘాలు సమావేశమయ్యాయి. ఈయూ, టీఎంయూ, ఎన్‌ఎంయూ, పలు సంఘాల నేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు. అన్ని రాజకీయ పక్షాల నేతలు కూడా సమావేశానికి హాజరయ్యారు. ఇందులో సమ్మెపై చర్చించారు. ఇదిలావుంటే  ఆర్టీసీ కార్మికులతో చర్చలకు సిద్ధమని ఆంధ్రప్రదేశ్‌ రవాణా శాఖ మంత్రి శిద్దా రాఘవరావు తెలిపారు. ఆర్టీసీ కార్మికులు మొండివైఖరి విడనాడి సమ్మె విరమించాలని ఆయన కోరారు. ఆర్టీసీ ఎండీ సాంబశిరావుతో కలిసి సచివాలయంలో శుక్రవారం సాయంత్రం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆర్టీసీ కార్మికులు చర్చలకు వస్తే స్వాగతిస్తామని, తమకు మొండి వైఖరి లేదన్నారు. ఏపీ ఎంసెట్‌ విద్యార్థులకు అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేశామని చెప్పారు. ఎంసెట్‌ కు సహకరించిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. శనివారం 60 శాతం బస్సులు నడుపుతామని మంత్రి చెప్పారు.