ఆర్టీసీ సిబ్బందికి శిక్షణ
భద్రాచలం పట్టణం: భద్రాచలం ఏపీఎన్ ఆర్టీసీ డిపోలో సోమవారం బస్సు డ్రైవర్లు, కండక్టర్లకు వృత్తి నైపుణ్యాలపై తరగతులు ప్రారంభించారు. ఈ సందర్భంగా సీటీవో నరసయ్య, డిపో మేనేజరు జేవీ బాబు మాట్లాడుతూ ప్రయాణికులతో మర్యాద పూర్వకంగా వ్యవహరించాలని కార్మికులకు సూచించారు. క్రమశిక్షణతో కూడిన వృత్తి నైపుణ్యం సంస్థ అభివృద్ధికి దోహద పడుతుందని వివరించారు.