ఆర్థిక అసమానతల తగ్గింపు ప్రభుత్వాలు దృష్టి పెట్టాలి

స్వర్ణభారతి ట్రస్ట్‌ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు

ప్రారంభించి ఉపరాష్ట్రపతి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు

హైదరాబాద్‌,అక్టోబర్‌26(జ‌నంసాక్షి): ఆర్థిక అసమానతలు తగ్గింపుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టిసారించాలని దేశ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. గురువారం స్వర్ణభారత్‌ ట్రస్ట్‌

ఆధ్వర్యంలో చేపట్టిన సేవా కార్యక్రమాలను ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రారంభించారు. ఈ కార్యక్రమాల్లో ఉపముఖ్యమంత్రి మహమూద్‌ అలీ, మంత్రి హరీశ్‌రావు, ఏపీ ఆరోగ్యశాఖా మంత్రి కామినేని శ్రీనివాస్‌ పాల్గొన్నారు. ఘాటి డ్రైవర్‌ శిక్షణ కేంద్రం, ఎల్‌అండ్‌టీ స్మార్ట్‌ సిటీ నైపుణ్యాల శిక్షణ కేంద్రాన్ని ఉపరాష్ట్రపతి ప్రారంభించారు. స్వర్ణభారత్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో ఉచిత వైద్యశిబిరాన్ని కూడా ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగావెంకయ్యనాయుడు మాట్లాడుతూ.. నేను ఈ సమావేశానికి వస్తానో.. రానో అనుకున్నానన్నారు. హార్ట్‌ సర్జరీ వల్ల రెస్ట్‌ తీసుకున్నా.. మనశ్శాంతి కలలేదని వెంకయ్య తెలిపారు. నా గుండె ఎక్కడుందో అక్కడికే వెళితే సంతృత్తి కలుగుతుందని భావించి స్వర్ణ భారతి ట్రస్ట్‌ కి వచ్చానని వెంకయ్యనాయుడు తెలిపారు. ఆర్థిక అసమానతలు తగ్గింపుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి సారించాలి ఆయన కోరారు. ప్రస్తుతతం దేశంలో అనేక సవాళ్లు ఉన్నాయన్నారు. ముఖ్యంగా విద్య, వైద్యం రెండు కళ్లలాంటివన్న వెంకయ్యనాయుడు వైద్య రంగంలో భారత్‌ చాలా వెనుకంజలో ఉందని పేర్కొన్నారు. 50శాతానికిపైగా ప్రజలు ప్రైవేట్‌ ఆసుపత్రులకు వెళ్తున్నారని తద్వారా ప్రభుత్వా సుపత్రులు మరుగున పడుతున్నాయన్నారు. నగరాల్లో 32 శాతం, గ్రామాల్లో 42శాతం మంది ప్రజలు మాత్రమే ప్రభుత్వ వైద్యశాలలకు వైద్యంకోసం వెళ్తున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వాలు వైద్య రంగంపై ప్రత్యేక శ్రద్ధ వహించి ప్రభుత్వాసుపత్రులను బలోపేతం చేయాలని వెంకయ్య కోరారు. కేంద్ర ప్రభుత్వం వైద్య రంగంలో మార్పులు తీసుకొచ్చేందుకు కషి చేస్తుందన్నారు. అన్ని జిల్లాల్లో వైద్య కళాశాలల ఏర్పాటుకు ప్రధాని చర్యలు తీసుకుంటున్నారన్నారు. రాష్ట్ర భారీనీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ క్యాంపస్‌ స్థాయిలో ట్రైనింగ్‌ సెంటర్‌ను నిర్మించటం అభినందనీయమని, వెంకయ్యనాయుడు ముద్ర అదుగడుగునా కనిపిస్తుందని అన్నారు. ప్రస్తుతం వృత్తి నైపుణ్య కోర్సులకు మంచి డిమాండ్‌ ఉందని, స్వర్ణభారతి ట్రస్ట్‌ ద్వారా ఉచిత శిక్షణ పొందిన విద్యార్థులు మరికొంత మందికి ఉపాధి కల్పించే స్థాయికి వెళ్లాలని హరీష్‌రావు ఆకాంక్షించారు.