ఆర్థిక సహాయం అందజేత
సూర్యాపేట ప్రతినిధి (జనంసాక్షి):స్థానిక 45వ వార్డుకు చెందిన ఎండీ
నోమాన్ కు హైదరాబాద్ లోని పాలిటెక్నిక్ కళాశాలలో సీటు వచ్చింది.తన కుటుంబ ఆర్ధిక పరిస్థితుల మూలంగా తన చదువును కొనసాగించేందుకు ఆ వార్డు కౌన్సిలర్ గండూరి పావని కృపాకర్ దంపతుల సహాయం కోరారు.వార్డు ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ, ఆపద వస్తే ముందుండే కౌన్సిలర్ గండూరి పావని కృపాకర్ దంపతులు మంత్రి జగదీష్ రెడ్డి స్పూర్తితో ఆ విద్యార్థికి రూ.10 వేలు ఆర్థిక సహాయం అందించి మరో మారు తమ మానవత్వాన్ని చాటుకున్నారు.ఈ కార్యక్రమంలో ఎండీ అలీ, మట్టపల్లి శ్రీధర్, కళ్యాణ్ , రాపోలు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
