ఆర్థిక సహాయం అందజేత
దండేపల్లి .జనంసాక్షి. సెప్టెంబర్ 19.దండేపల్లి మండలం కన్నేపల్లి గ్రామంలో గత నెలల కిందట అనారోగ్యం తో మ్రృతి చెందిన కందుకూరి భూమక్క, జాడి కిష్టయ్య అనే రెండు కుటుంబాలు పెద్ద దిక్కు ను కోల్పోవడం జరిగింది.సోమవారం మానవతా దృక్పథంతో కన్నేపల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ ఆద్వర్యంలో 25 కిలోల బియ్యం,ఇరు కుటుంబాల కు 3000 రూపాయిల ఆర్థిక సహాయం అందించారు.ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ. అనారోగ్యంతో మృతి చెందిన రెండు కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో చుంచు నగేష్, ఎంపిటిసి తోట మోహన్, ఆకుల తిరుపతి,ముత్తే గురువయ్య,ముత్తే మహేష్,లశేట్టి చంద్రయ్య,బాలసాని వేణు,గొర్ర సత్తయ్య,కొట్టే మొగిలి,అక్కల మల్లేష్, దుమ్మని సందీప్,ముత్తే తిరుపతి,ముక్కేర మహేష్,మర్రిపెల్లి రాజయ్య, బాలసాని శంకరయ్య, చుంచు లక్ష్మణ్,చాట్ల మల్లేష్,లశేట్టి నరేష్ తదితరులు పాల్గొన్నారు.