ఆర్‌కే నగర్‌ ఉప ఎన్నికలు ప్రశాంతం

1
74.4శాతం పోలింగ్‌

చెన్నై, జూన్‌ 27(జనంసాక్షి): తమిళనాడులోని ఆర్‌.కె నగర్‌ నియోజకవర్గానికి శనివారం జరిగిన ఉపఎన్నిక ప్ర శాంతంగా ముగిసింది. పోలింగ్‌ ముగిసే సమయానికి 74.4 శాతం ఓటింగ్‌ నమోదైందని అధికారులు ప్రకటించారు. ఆర్‌.కె నగర్‌ బరిలో రాష్ట్ర ముఖ్యమంత్రి జె. జయలలిత, సిపిఐ అభ్యర్థి సి. మహేంద్రన్‌, మరోనేత రామస్వామి ప్రముఖంగా ఉన్నారు. కాగా, ప్రతిపక్ష పార్టీలైన డీఎంకే, డీఎండీకే, బీజేపీ, కాంగ్రెస్‌, ఎండీఎంకే, పీఎంకే పార్టీలు ఈ ఉప ఎన్నికను బహిష్కరించాయి.

అక్రమాస్తుల కేసులో ముఖ్యమంత్రి పదవి కోల్పోయి ఏడాది పాటు జైలు జీవితం గడిపిన జయలలితకు కర్ణాటక హైకోర్టు క్లీన్‌ చిట్‌ ఇచ్చింది. జైలు నుంచి విడులైన వెంటనే జయలలిత తిరిగి తమిళనాడు ముఖ్యమంత్రి పదవిని చేపట్టింది. ఈ క్రమంలో సీఎం పదవి చేపట్టడానికి శాసనసభ నుండి గానీ, శాసన మండలి నుంచి గానీ సభ్యులుగా ఉండాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో జయకు లైన్‌ క్లీయర్‌ చేస్తూ ఆర్‌.కె నగర్‌ నియోజకవర్గానికి చెందిన ఎఐఏడీఎంకే ఎమ్మెల్యే పి. వట్రివేళ్‌ తన పదవికి రాజీనామా చేశారు. దీంతో ఆ స్థానానికి ఎన్నికలు నిర్వహించారు.