ఆర్‌బీఐ కీలక వడ్డీరేట్లు యథాతథం

rbi-gov-rajan

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) కీలక వడ్డీరేట్లు యథాతథంగా ఉంచుతున్నట్లు గవర్నర్ రఘురాం రాజన్ ప్రకటించారు. ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన సమీక్ష అనంతరం మీడియాతో మాట్లాడిన రాజన్.. రెపోరేటు 6.5 శాతం, రివర్స్ రెపోరేటు 6 శాతం, సీఆర్ఆర్ 4 శాతం యథాతథంగా కొనసాగుతునందని తెలిపారు. ఈ సారి మెరుగైన వర్షాపాతం ఉంటుదని భావిస్తున్నామన్నారు. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం ద్వైమాసిక ద్రవ్య పరపతి సమీక్షలో భాగంగా పలు అంశాలపై సమీక్ష జరిపినట్లు తెలిపారు. అటు రెండో సారి ఆర్‌బీఐ గవర్నర్ గా బాధ్యతలు చేపడతారా? అని అడిగిన ప్రశ్నకు.. అది మీకే తెలియాలి అంటూ సమాధానమిచ్చారు.

అటు ఆర్‌బీఐ త్రైమాసిక సమీక్షతో పాటూ ఇంటర్నేషనల్ మార్కెట్ల పాజిటివ్ ట్రెండ్ మార్కెట్ పై కనిపిస్తోంది. స్టాక్ మార్కెట్ల స్వల్ప లాభాల్లో కొనసాగుతున్నాయి. రెపో రేటు, రివర్స రెపో రేటులో ఎలాంటి మార్పు లేదని ఆర్‌బీఐ ప్రకటించడంతో.. మార్కెట్లు మరింత పుంజుకుంటాయని నిపుణులు భావిస్తున్నాయి. ప్రస్తుతం బీఎస్సీ సెన్సెక్స్ 80 పాయింట్ల లాభంతో 26 వేల 859 దగ్గర ట్రేడవుతోంది. నిఫ్టీ 25 పాయింట్ల లాభంతో 8వేల 226 దగ్గర కొసాగుతోంది.