-->

ఆలయాల్లో శివరాత్రికి ప్రత్యేక ఏర్పాట్లు

ఆదిలాబాద్‌,ఫిబ్రవరి16(జ‌నంసాక్షి ):  బాసర సరస్వతి ఆలయం భక్తులతో కళకళలాడింది. శివరాత్రికి తోడు వరుస సెలవుల కారణంగా అమ్మవారి దర్శనం కోసం భక్తులు వేలాదిగా తరలివచ్చారు. మాఘ బహుళ ఏకాదశి సందర్భంగా అమ్మవారిని దర్శించుకునేందుకు, చిన్నారుల అక్షరాభ్యాసాలకు భారీసంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఇక జిల్లాలో పలు ఆలయాల్లో శివరాత్రి శోభ సంతరించుకుంది. ఆలయాల్లో ప్రత్యక ఏర్పా/-టుల చేశారు. మహాశివరాత్రి పండగను పురస్కరించుకుని నందితాండ శివాలయంలో నందీశ్వరుని
ఆలయంలో  జాతర ప్రారంభమైంది. గిరిజన సంప్రదాయబద్ధంగా ఆలయంలోని శివుడు, నందీశ్వరునికి ప్రత్యేక పూజలు నిర్వహించి జాతరను ప్రారంభించారు. ఇక్కడ మహాశివరాత్రి రోజు భక్తుల సందడి ఉంటుంది. వేల సంఖ్యలో భక్తులు తరలివస్తారని కమిటీ సభ్యులు  తెలిపారు. అభిషేక ప్రియుడైన ముక్కంటి కోర్కెలు తీర్చే పేదల దేవుడిగా పూజలు అందుకుంటున్నాడు. ఏటా మహాశివరాత్రి రోజున నియమ నిష్టలతో ఆరాధిస్తూ, ఉపవాస దీక్షలతో భక్తులు జాగరణలో పాల్గొంటారు. ఎక్కడ చూసినా ఓం నమ శివాయ నామస్మరణతో మార్మోగుతాయి.ఈనేపథ్యంలో జిల్లాలో ప్రసిద్ధి చెందిన ఆలయాల్లో భక్తుల సందడి నెలకొంది.  ప్రత్యేక రాష్ట్రంలో వచ్చిన తొలి మహాశివరాత్రి కావడంతో ప్రముఖుల, భక్తుల తాకిడి ఈసారి ఎక్కువగానే ఉంటుందనే ఉద్ధేశ్యంతో ఆలయాధికారులు జాగరణ ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని దర్శనం కోసం, పుష్కరిణి వద్ద బారికేడ్లు ఏర్పాటు చేశారు. కదిలి  ఆలయంలో నిషిరాత్రి నుంచి ప్రత్యేక పూజలు కొనసాగనున్న నేపథ్యంలో కదిలి మాడేగాం, నిర్మల్‌కు చెందిన పలువురు భక్తులతో వాలంటీరు సేవలు అందించేందుకు  ఏర్పాట్లు చేపట్టారు. ఆలయ