ఆలస్యంగా మేల్కొన్నాం
– స్టార్టప్ ఇండియాలో రాష్ట్రపతి ప్రణబ్
న్యూఢిల్లీ,జనవరి16(జనంసాక్షి):యువతను ప్రోత్సహించేలా స్టార్టప్ ఇండియాను తీసుకురావడంలో భారత్ ఇప్పుడే మేల్కొందని.. ఈ ఆలస్యానికి కారణంగా తానేనంటూ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ వ్యాఖ్యలు చేశారు. అంకుర భారత్ ప్రారంభోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ శుక్రవారం రాత్రి దిల్లీలోని సిలికాన్‌వ్యాలీలో సీఈవోలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్టార్టప్ ఇండియాను మరింత ముందు ప్రవేశపెట్టాల్సిందని అభిప్రాయపడ్డారు. ఇందుకు ఓ రకంగా తాను కారణమని.. తాను ఆర్థికమంత్రిగా ఉన్నప్పుడు పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడంలో వెనుకబడ్డానన్నారు. ఏదేమైనా.. స్టార్టప్ ఇండియా కోసం ప్రస్తుత ప్రధాని నరేంద్రమోదీ చేస్తున్న ప్రయత్నం అభినందనీయమని పేర్కొన్నారు. దీంతో స్టార్టప్ కంపెనీలతో యువతకు అవకాశాలు పెరుగుతాయన్నారు.ప్రభుత్వ అజామాయిషీ ఎంత తక్కువగా ఉంటే సంస్థలు అంత బాగా వృద్ది చెందుతాయని కేంద్ర ఆర్దిక మంత్రి అరుణ్ జైట్లి అన్నారు.స్టార్ట్ అప్ ఇండియా కార్యక్రమాన్ని ప్రారంభించిన సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ ప్రబుత్వ పర్యవేక్షణ లేనందువల్లే ఐటి రంగం అబివృద్ది చెందిందని ఆయన అన్నారు. ప్రభుత్వ పర్యవేక్షణలో ఉంటే అది సాధ్యమయ్యేదా అన్న అనుమానాన్ని ఆయన వ్యక్తం చేశారు. పలురకాల పరిశ్రమలు నష్టాల బాటలో ఉంటే, ఐటి రంగం మాత్రం విప్లవాత్మక మార్పులతో ముందుకు వెళుతోందని జైట్లి అన్నారు.గతంలో లైసెన్స్ రాజ్ వల్ల పారిశ్రామికవేత్తలు అనేక ఇబ్బందులు పడ్డారని, కాలక్రమంలో భారత దేశం ఆ పద్దతులను వదలుకుందని ఆయన అన్నారు.యువ పారిశ్రామిక వేత్తలకు స్టార్ట్ అప్ ఇండియా వేదిక అవుతుందని జైట్లి చెప్పారు.ఒక్కో రాష్టాన్రికి ఒక్కో పారిశ్రామిక విదానం ఉంటోందని,ఇది మారాలని, అందువల్ల విదాన నిర్ణయాలలో రాష్ట్ర ప్రభుత్వాల పాత్రను తగ్గించాలని బావిస్తున్నామని జైట్లి చెప్పారు.