ఆలస్యంగా వచ్చిన విద్యార్థులకు నో ఎంట్రీ

హైదరాబాద్‌, జనంసాక్షి: ఎంసెట్‌ పరీక్షకు ఆలస్యంగా వచ్చిన విద్యార్థులను పరీక్ష కేంద్రంలోకిఅనుమతించలేదు. కూకట్‌పల్లి ఎంఎన్‌ఆర్‌ కాలేజీలో పరీక్ష సెంటర్‌కు అయిదు నిమిషాలు ఆలస్యంగా వచ్చిన విద్యార్థిని లోనికి అనుమతించలేదు. అలాగే బండ్లగూడలో ఇద్దరు విద్యార్థులు, నిజాం కళాశాల సెంటర్‌లో ఇద్దరు విద్యార్థులు ఆలస్యంగా రావటంలో వారికి పరీక్ష రాసేందుకు అనుమతి ఇవ్వలేదు. వరంగల్‌ జిల్లా జనగామలోనూ ఓ విద్యార్థిని పరిక్షా కేంద్రంలోకి అనుమతించలేదు.