ఆళ్లపల్లి నూతన ఎస్సై గా రతీష్
ఆళ్లపల్లి ఆగస్టు 24 (జనం సాక్షి)
ఆళ్లపల్లి నూతన ఎస్సైగా రతీష్ గురువారం బాధ్యతలు స్వీకరించారు .గతంలో కొత్తగూడెం ఎస్పీ ఆఫీసులో విధులు నిర్వహించారు. ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న ఎస్సై సంతోష్ బూర్గంపాడు ఎస్సైగా బదిలీ అయ్యారు .ఈ సందర్భంగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఎస్సై రతీష్ మాట్లాడుతూ… నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటానని అన్నారు. ప్రతి ఒక్కరూ పోలీస్ వ్యవస్థకు సహకరించాలని ఈ సందర్భంగా గుర్తు చేశారు