ఆవిర్భావం నుంచి నష్టపరిహారం

5

– ఓకే విడతలో రుణమాఫీ

– మంత్రి కేటీఆర్‌

హైదరాబాద్‌,అక్టోబర్‌1(జనంసాక్షి): రైతుల ఆత్మహత్యలపై విపక్షాలు శవరాజీకయాలు చేస్తున్నాయని మంత్రి కెటి రామారావు మండిపడ్డారు. శవాలపై పేలాలు ఏరుకునే రీతిలో రాజకీయాలు చేయడం దారుణమన్నారు. గతంలో రైతులకోసం ఏం చేసామో చెప్పుకునే స్థితిలో కూడా వారు లేరని మంత్రి అన్నారు.రాష్ట్ర ఆవిర్భావం నుంచి ఆత్మహత్యలు చేసుకున్న రైతులకు నష్ట పరిహరం అందించడంతో,ఒకేవిడత రుణ మాఫీకి రాష్ట్ర ప్రభుత్వం సాను భూతితో ఉందన్నారు. రైతు సమస్యలపై శాసనసభలో ప్రభుత్వం స్పష్టమైన సమాధానం చెప్పిందని మంత్రి కేటీఆర్‌ గురువారం నాడిక్కడ విూడియా సమావేశంలో తెలిపారు. శాసనసభలో విపక్షాలు 6గంటల 23 నిమిషాలు మాట్లాడితే… అధికార పక్షం మాత్రం గంటా 50 నిమిషాలు మాత్రమే మాట్లాడిందన్నారు. 15నెలల కాలంలో జరిగిన అభివృద్ధిని ఈ సమావేశాల్లో సావధానంగా వివరించినట్లు తెలిపారు. రైతు సమస్యలపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ గంటా 45 నిమిషాలు మాట్లాడి… స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక ప్రణాళికలను వివరించారన్నారు. ఆత్మహత్యలపై రాజకీయాల జోలికి పోకుండా సిఎం సంయమనంతో సమాధానం ఇచ్చారన్నారు.  ఆత్మహత్య లు చేసుకున్న రైతుల కుటుంబాలకు ఆరు లక్షల సాయం ఇస్తున్న ప్రభుత్వం దేశంలోనే తెలంగాణ ఒక్కటేనని కెటిఆర్‌ తెలిపారు. ఇంత చేసినా ప్రతిపక్షాలు శవాలపై పేలాలు ఏరుకునే రీతిలో వ్యవహరిస్తున్నాయని ఆయన ద్వజమెత్తారు. చర్చకన్నా రచ్చ చేయడం కోసం సిగ్గు లేకుండా నీచాతినీచంగా సిద్దాంతాలను పక్కనబెట్టి రాజకీయం చేస్తున్నాయని కెటిఆర్‌ ఆరోపించారు.ముఖ్యమంత్రి ఎంతో సంయమనంగా సభలో మాట్లాడితే విపక్షాలు రాజకీయం చేస్తున్నాయని అన్నారు.బయట ఏదో పొడుస్తామని చెప్పిన విపక్షాలు సభలోకి వచ్చాక ప్రభుత్వ వాదన విన్న తర్వాత ఏమి చేయాలో తెలియక రచ్చ చేస్తున్నారని ఆయన అన్నారు .గతంలో విద్యుత్‌ కోతలు, బిల్లుల మోతలు ఉండేవని… తమ ప్రభుత్వం వచ్చాక విద్యుత్‌ సమస్యలను అధిగమించినట్లు కేటీఆర్‌ స్పష్టం ఏశారు. రైతులకు సకాలంలో విత్తనాలు, ఎరువులు సరఫరా చేసినట్లు తెలిపారు. మిషన్‌ కాకతీయలో భాగంగా దాదాపు 7వేల చెరువులను పునరుద్ధరించినట్లు పేర్కొన్నారు. .ముఖ్యమంత్రి కెసిఆర్‌ రైతులకు భరోసా కల్పించేందుకు తన ప్రసంగంలో గట్టి ప్రయత్నం చేశారని ఆయన అన్నారు. కరెంటు సరఫరా పై కెసిఆర్‌ చెప్పినప్పుడు విపక్షాలు కాదనలేకపోయాయని ,దీనిని బట్టే తమ ప్రభుత్వం చిత్తశుద్ది ఏమిటో తెలుస్తుందని ఆయన అన్నారు. రైతులకు ఎన్ని రకాలుగా సహాయ పడుతున్నది కెసిఆర్‌ సవివరంగా సభలో చెప్పారని ఆయన అన్నారు. గత ప్రభుత్వాల హయాంలో విత్తనాలు దొరక్క రైతులు ఎన్ని ఆందోళనలు చేయవలసి వచ్చేదో అందరికి తెలుసనని ఆయన అన్నారు.  రైతు సమస్యలపై శాసనసభలో ప్రభుత్వం స్పష్టమైన సమాధానం చెప్పిందని తెలిపారు. 15 నెలల కాలంలో జరిగిన అభివృధ్ధిని సీఎం కేసీఆర్‌ సావధానంగా వివరించారని పేర్కొన్నారు. స్వల్పకాలికం, మధ్యకాలికం, దీర్ఘకాలిక రాబోయే రోజుల్లో ఏం చేస్తామనే దానిపై సీఎం కేసీఆర్‌ చెప్పారని పేర్కొన్నారు. రాష్ట్రం ఏర్పడిన తరుణంలో విద్యుత్‌ కోతలు అధికంగా ఉండేవని, అయినా కేవలం 6 నెలల కాలంలో ఎవరూ ఊహించిన విధంగా సమస్యను అధిగమించడం జరిగిందన్నారు. రైతుల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు.  ముందే ప్రణాళికలు సిద్ధం చేసి విత్తనాలు..ఎరువులు సకాలంలో అందించడం జరిగిందన్నారు. 540 కోట్ల ఇన్‌ పుట్‌ సబ్సిడీ ఎలా చెల్లించారో కేసీఆర్‌ వెల్లడించారని పేర్కొన్నారు. 1.08 వేల ట్రాకర్టపై రవాణా పన్నును మినహాయించడం జరిగిందన్నారు. పండిన పంటలో 91 శాతాన్ని కొనుగోలు చేసిన ఘనత టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానిదేనన్నారు. ఇవన్నీ చేసినా రైతుల ఆత్మహత్యలు జరుగుతుండడంతో రూ.6లక్షల పరిహారం ఇవ్వడం జరుగుతోందని గుర్తు చేశారు. ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి ఇది వర్తిస్తుందన్నారు. సెప్టెంబర్‌ 30వ తేదీ తరువాతే కరవు మండలాలను ప్రకటించాలని ఒక నిబంధన ఉందని, ప్రకటిస్తామని సీఎం కేసీఆర్‌ పేర్కొనడం జరిగిందన్నారు. వన్‌ టైం సెటిల్‌ మెంట్‌ విషయంలో ప్రభుత్వం సానుభూతితో పరిశీలిస్తామని చెప్పినా విపక్షాలు నీచాతినీచంగా ప్రవర్తించాయని విమర్శించారు.